Sarfira : జనాలని థియేటర్లకు రప్పించడానికి మేకర్స్ కష్టాలు.. ఆఖరికి సమోసాలు ఫ్రీ అని కూడా అనేశారు

Sarfira : బాలీవుడ్ లో గత కొంత కాలంగా సరైన సినిమాలు రావట్లేదని తెలిసిందే. ఎదో చిన్న సినిమాలతో అలా నెట్టుకొస్తున్నారు తప్ప, నిఖార్సైన సినిమా ఒక్కటీ పడట్లేదు. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన బడా సినిమాలన్నీ బోల్తా పడ్డాయి. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా జనాలు ఆదరించలేదు. ఇక లేటెస్ట్ గా విడుదలైన సర్ఫిరా సినిమాకి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఈ సినిమా కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాని రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. మంచి స్ట్రాంగ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో కూడా ఒరిజినల్ డైరెక్టర్ సుధా కొంగర నే డైరెక్ట్ చేసారు. ఇక హిందీలో కూడా ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది గాని ప్రేక్షకులని థియేటర్లకు రప్పించడం లో మాత్రం మేకర్స్ విఫలమయ్యారు.

Tea Samosa Free Offer for Sarfira Movie

మేకర్స్ కష్టాలు.. ఆఖరికి సమోసాలు కూడా ఫ్రీ అనేసారు..

ఇక ప్రేక్షకులని థియేటర్లకు రప్పించడానికి బాలీవుడ్ మేకర్స్ ఆపసోపాలు పడుతున్నారు. కంటెంట్ లేని సినిమాలకైతే ఒకే, గాని మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా సరిగా ప్రమోట్ చేయలేక ప్లాప్ లు అందుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. అక్షయ్ కుమార్ సర్ఫిరా సినిమాకి అదే పరిస్థితి వచ్చింది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినా, థియేటర్లలో సగం కూడా ఫుల్ అవని పరిస్థితి నెలకొని ఉంది. తొలి రెండు రోజుల్లో పట్టుమని పది కోట్లు కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా. అందుకే మేకర్స్ కొన్ని చోట్ల బై వన్ గెట్ వన్ టికెట్ ఆఫర్ ని కూడా పెట్టేసారు. తాజాగా PVR మాల్ లో అయితే సమోసా, టీ కూడా ఫ్రీ అనేసారు. అంటే సర్ఫిరా సినిమాని ప్రేక్షకులు ఎంతలా పట్టించుకోవట్లేదో అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -

మళ్ళీ కల్కివైపే ఆడియన్స్ చూపు..

ఇక తాజాగా విడుదలైన ఇండియన్2, అలాగే సర్ఫిరా సినిమాలు ఆశించినంత రెస్పాన్స్ తెచ్చుకోకపోవడంతో ఆడియన్స్ మళ్ళీ కల్కి సినిమాకే మొగ్గు చూపుతున్నారు. ఈ వీకెండ్ లో కల్కి కి వచ్చిన వసూళ్లే దానికి నిదర్శనం. ఓవరాల్ గా సర్ఫిరా (Sarfira) సినిమాతో అక్షయ్ కుమార్ మరో ప్లాప్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి మేకర్స్ చేస్తున్న ఫ్రీ ప్రమోషన్లతో కనీసం నష్టాలు అయినా తగ్గుతాయా అన్నది చూడాలి. ఇక సర్ఫిరా వంద కోట్లు వసూలు చేయడం కూడా కష్టమే అని బుకింగ్స్ ని చూస్తే అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు