Tripti Dimri: టీమిండియా క్రికెటర్‌ టచ్‌ లోకి హాట్‌ బ్యూటీ?

 

Tripti Dimri: త్రిప్తి దిమ్రి ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో రోజుల నుంచి సినిమాల్లో ఈ బ్యూటీ నటిస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక యానిమల్ సినిమా అనంతరం ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో త్రిప్తి దిమ్రి స్క్రీన్ పైన కనిపించింది కేవలం 30 నిమిషాలే అయినప్పటికీ…. హీరోయిన్ రష్మిక మందన్నకి మించిన క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో బాబి 2 అంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా రణబీర్ కపూర్, త్రిప్తి దిమ్రి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా అనంతరం త్రిప్తి దిమ్రికి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక విక్కీ కౌశల్ నటిస్తున్న బ్యాడ్ న్యూస్ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఈ బ్యూటీ వివిధ రకాల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

- Advertisement -

Mumbai: Athiya Shetty, KL Rahul buy an apartment worth Rs 20 crore in  Bandra's Pali Hill
ఇదిలా ఉండగా తాజాగా…. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారట. తన భార్య అతియా శెట్టితో కలిసి ముంబైలోని వెస్ట్ బాంద్రాలో విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్ కోసం ఈ జంట రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. వెస్ట్ బాంద్రాలోని 3350 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఫ్లాట్ కోసం రూ. 1.20 కోట్ల స్టాంపు డ్యూటీ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ అపార్ట్‌ మెంట్‌ లో బాలీవుడ్ నటీనటులు నివాసం ఉంటున్నారు. ఇప్పటికే త్రిప్తి దిమ్రి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారట. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కూడా ఇదే అపార్ట్‌ మెంట్‌ లో ఉంటున్నట్లు సమాచారం. దీంతో కేఎల్ రాహుల్ బాలీవుడ్ హీరోయిన్లకు దగ్గర కావాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్లాట్ కి వెళ్ళాడని అతనిపై సెటైర్లు పెల్చుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు