Teja Sajja: హనుమాన్ కోసం అన్ని త్యాగాలా..?

Teja Sajja

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు యంగ్ హీరో తేజ సజ్జ.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో దేశీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో హనుమాన్ సినిమాని తెరకెక్కించగా.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు థియేటర్లలోకి వచ్చి దాదాపు మూడు వారాల పైనే అవుతున్నా ఇంకా అదే హవా కొనసాగుతోంది. అటు పిల్లలను పెద్దలను మెప్పించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఈ సినిమా కోసం తాను చేసిన త్యాగాల గురించి వెల్లడించారు.

హనుమాన్ సినిమా పనులు పూర్తి చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.. ఈ సమయంలో వేరే సినిమాల గురించి అసలు దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా నాకు ఇతర సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.. ఇక ఈ సినిమా చేస్తున్న సమయంలో దాదాపు 75 ప్రాజెక్టులను నేను తిరస్కరించాను.. అందులో కనీసం 15 ప్రాజెక్టులు చాలా బాగున్నాయి.. అయితే హనుమాన్ సినిమాకి పూర్తిగా కమిట్ అయ్యాను కాబట్టే ఆ సినిమాలన్నింటినీ వదులుకున్నాను అంటూ తేజా సజ్జ తెలిపారు.

ఇకపోతే కేవలం రూ .60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించింది. ఇక ఈ సినిమా చేయడానికి తాను చాలా కష్టపడ్డాను అని తేజ తాజాగా గుర్తు చేసుకున్నారు. సాధారణంగా ఇతర నటీనటులు రెండు – మూడు లుక్ టెస్ట్ లు మాత్రమే చేస్తారు.కానీ ఈ సినిమాలో సూపర్ హీరో లుక్ కోసం 25 లుక్ టెస్ట్ లు చేశాము.. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు కూడా చాలా కష్టం అనిపించింది.. అలాంటి ఎన్నో సన్నివేశాలలో నేను నటించాను అంటూ తెలిపారు తేజ..

- Advertisement -

ఇకపోతే హనుమాన్ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలైంది. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా.. రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇకపోతే ఈ సినిమాకి పోటీగా మహేష్ బాబు గుంటూరు కారం , నాగార్జున నాసామిరంగా, వెంకటేష్ సైంధవ్ చిత్రాలు గట్టి పోటీ ఇచ్చినా.. వాటన్నింటినీ తట్టుకొని నేడు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ ని కూడా ప్రకటించారు.. జై హనుమాన్ అనే టైటిల్ ని ఖరారు చేయగా.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. మొత్తానికైతే ఈ సినిమాతో తేజా సజ్జ డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు