Teja Sajja: స్టార్ సినిమా నా కళ్ళల్లో చాలాసార్లు నీళ్ళు తెప్పించింది

Teja Sajja: ప్రస్తుతం ఉన్న తమిళ్ యంగ్ హీరోస్ లో కెవిన్ ఒకరు. మొదట టెలివిజన్ లో తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద కెవిన్ చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. లిఫ్ట్ మరియు దాదా సినిమాలు కెవిన్ కి మంచి పేరును తీసుకొచ్చాయి. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు లాగానే బాగా కష్టపడి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. శివ అరవింద్ దర్శకత్వం వహించిన “నటపున ఎన్నన్ తెరియుమా”అనే సినిమాతో డెబ్యు హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాడు.

వినీత్ వరప్రసాద్ దర్శకత్వంలో 2021 లో వచ్చిన లిఫ్ట్ అనే సినిమాలో కెవిన్ లీడ్ రోల్ కనిపించాడు. ఈ సినిమా నేరుగా హాట్స్టార్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమాతోనే వినీత్ వరప్రసాద్ డెబ్యూ డైరెక్షన్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్ కామెడీ ఫిలిం దాదా. ఈ సినిమాను గణేష్ కే బాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక రీసెంట్ గా స్టార్ అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద తన టాలెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు కెవిన్.

Star Movie Kevin

- Advertisement -

స్టార్ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది కానీ తెలుగులో రిలీజ్ కాలేదు ఇప్పుడు ఆ తెలుగు వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది అయితే చాలామంది తెలుగు ఆడియోస్ ఆ సినిమాను చూసి దానిపైన ప్రశంసలు కురిపిస్తున్నారు. నాకు నటుడు అవ్వడానికి ఆ సినిమాలో మీరే చేసే జర్నీ చాలామందిని ఆకట్టుకుంటుంది. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నట్లు ఆ సినిమాలో హీరో కెరియర్ లో కూడా అన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇకపోతే ఆ సినిమా చాలామందికి ఇష్టంగా మారుతుంది. నటులు మాత్రం ఈ సినిమాకి డీప్ గా కనెక్ట్ అయిపోతున్నారని చెప్పొచ్చు.

రీసెంట్ గా సినిమా చూసిన హీరో తేజ సజ్జ కూడా ఈ సినిమా గురించి మూడు రోజుల క్రితం ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాను గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా తనకు ఎంత బాగా నచ్చిందో చెబుతూ ఆ టీం అంతటికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తేజ తో పాటు చాలామంది ఈ సినిమా పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు