Mirai : ‘మిరాయ్’ నుంచి తేజా బర్త్ డే అప్డేట్ వచ్చేసింది.. సూపర్ మ్యాన్ గా హీరో లుక్..

Mirai : టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. అంతేకాదు అందరికీ షాక్ ఇచ్చేలా భారీ కలెక్షన్ను కూడా అందుకుంది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తరువాత ప్రాజెక్ట్‌కి రెడీ అయిపోయాడు. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ అనుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ అనే భారీ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి తేజా బర్త్ డే సందర్బంగా పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తేజా సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో మిరాయ్ సినిమా చేస్తున్నాడు. ఇతను రవితేజతో ఈగల్ సినిమాను తీశాడు.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తేజా బర్త్ డే సందర్బంగా అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Teja's birthday update from 'Mirai' has arrived.
Teja’s birthday update from ‘Mirai’ has arrived.

ఈ సినిమా కథ హనుమాన్ కు భిన్నంగా ఉంటుంది. ఆ సినిమా దేవుడికి రిలేటెడ్ గా వస్తే ఇది క్షుద్ర పూజల నేపథ్యంలో వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్, దుల్కర్ లాంటి హీరోలు కూడా కనిపించనున్నారు. దుల్కర్ అయితే ఓ యోధుడి పాత్రలో పాత్రలో మెరువనున్నాడు.. మంత్రగాడు పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నాడని సమాచారం.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రను రివిల్ చేస్తున్నట్లు ప్రకటించింది టీమ్.. ఈ మేరకు మంత్రగాడి పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇక మంచు మనోజ్ మంత్రగాడు పాత్రలో నటిస్తున్నాడు.. ఈ మూవీలో రితికా నాయక్‌ హీరోయిన్ గా నటిస్తుంది…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు