Tejaswini – Brahmani: అతడి కోసం గొడవ పడుతున్న బాలయ్య డాటర్స్.. ఏమైందంటే..?

Tejaswini – Brahmani.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు వారసుడిగా అటు సినీ ఇండస్ట్రీలోనూ.. ఇటు రాజకీయ రంగంలోనూ అలుపెరుగని కృషి చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బాలకృష్ణ.. ఒకవైపు అద్భుతమైన కథలను ఎంచుకుంటూ.. సినిమాలలో హ్యాట్రిక్ అందుకుంటూ దూసుకుపోవడమే కాదు.. మరొకవైపు రాజకీయాలలో కూడా హ్యాట్రిక్ సాధిస్తూ ఇటు ప్రజల నమ్మకాన్ని కూడా పేరు సొంతం చేసుకున్నారు.

పోటీ పడుతున్న అక్కాచెల్లెళ్లు..

Tejaswini - Brahmani: Balayya's daughters fighting for him.. what happened..?
Tejaswini – Brahmani: Balayya’s daughters fighting for him.. what happened..?

ఇదిలా ఉండగా ఈయనకు ఇద్దరు కూతుర్లు , ఒక కొడుకు వున్న విషయం తెలిసిందే.. కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. మరొకవైపు ఈయన కూతుర్లు… పెద్ద కూతురు నారా బ్రాహ్మణి… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, ఐటి ముఖ్యమంత్రి నారా లోకేష్ సతీమణి.. ఇంకొకరు తేజస్విని.. ఈమె భర్త భరత్ కూడా రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసింది. ఇటీవలే ఆయన కూడా ఎంపీగా  గెలుపొందారు. ప్రస్తుతం తేజస్విని తన తండ్రి సినిమాలకు సంబంధించి, షోలకు సంబంధించి పలు వ్యవహారాలు చూసుకుంటున్నారు.. మరొకవైపు బ్రాహ్మణి హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమ రంగాలలో బిజీగా ఉంటే ఇప్పుడు ఒక వ్యక్తి కోసం ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు గొడవ పడుతున్నారనే వార్త తెరపైకి వచ్చింది.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కన్ఫ్యూజన్ లో నందమూరి కుటుంబం…

అసలు విషయంలోకి వెళ్తే నందమూరి నటసింహ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయడం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.. అయితే సరైన కథ దొరకక ఆయన తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోతున్నారు..అయితే మరోవైపు కథ చర్చలు జరుగుతున్నాయని .. త్వరలోనే ఎంట్రీ ఇస్తారని గత రెండు సంవత్సరాలుగా కామెంట్లు వినిపిస్తున్నా.. ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ కి నోచుకోలేదు.. కానీ తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ పై నందమూరి ఫ్యామిలీలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. మోక్షజ్ఞ నటించే సినిమాకి నిర్మాతగా ఎవరు ఉండాలో అన్నది ఎటూ తేల్చుకోలేకపోతోందట నందమూరి కుటుంబం.

- Advertisement -

తమ్ముడి మొదటి సినిమాకు నిర్మాత ఎవరు..?

ఇకపోతే త్వరలోనే మోక్షజ్ఞ సెట్ పైకి రావడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయట. అయితే మోక్షజ్ఞతో సినిమా చేసే విషయంలో బాలయ్య ఇద్దరు కుమార్తెలు పోటీ పడుతున్నారని సమాచారం.. తమ ముద్దుల తమ్ముడు మొదటి సినిమా నిర్మాణ బాధ్యతలు తనకు కావాలంటే తనకు కావాలని బాలయ్య ఇద్దరు కూతుర్లు పోటీ పడుతున్నారని సమాచారం.. ఇకపోతే బాలయ్య కూతుర్లలో చిన్న కుమార్తె తేజస్వినికి మాత్రమే సినీ రంగంతో అనుబంధం ఉంది.. ఆమె బాలయ్య సినిమా వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉంటారు… అందుకే తమ్ముడు మోక్షజ్ఞ సినిమాని తానే నిర్మిస్తానని ముందుకు వచ్చిందట .. అయితే ఈ అవకాశం తనకే ఇవ్వాలని బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణి కూడా పట్టుబడుతున్నట్లు సమాచారం.. ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న బ్రాహ్మణి సినీ నిర్మాతగా మారుతాననడంతో ఇంకో కుమార్తె కూడా నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏమి తేల్చుకోలేకపోతున్నారట బాలయ్య.. “కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం” అన్నట్టుగా తన పరిస్థితి అయిపోయిందని తల పట్టుకుంటున్నారట బాలయ్య.. మరి ఈ విషయంపై ఎవరు తగ్గుతారు? ఎవరు నెగ్గుతారో ?చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు