CM reaction on SDT Post : మెగా మేనల్లుడి పోస్ట్ కి సీఎం రియాక్షన్… యూట్యూబ్ పై కేసు నమోదు

CM reaction on SDT Post : మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది అనుచిత ప్రవర్తనల గురించి ముఖ్యంగా, ఓ వీడియో గురించి ప్రస్తావిస్తూ, తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉండమని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఫ్రీడమ్, హక్కు అన్న పేరుతో కొందరు యూట్యూబర్స్ ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతూ బిహేవ్ చేస్తున్నారు.. పైగా సెలబ్రిటీలు, సామాన్యులు అని తేడా కూడా లేకుండా ప్రతి ఒక్కరిపై బూతులు , నెగిటివ్ కామెంట్లు డబుల్ మీనింగ్ డైలాగ్లతో రెచ్చిపోతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొందరు యూటుబర్లు అయితే తల్లి దండ్రులకు కూడా వ్యంగంగా అర్ధాలు జోడిస్తూ భారతీయతని కల్చర్ ని భ్రష్టు పట్టిస్తున్నారు. అయితే దీనిపై సాయి ధరంతేజ్ రియాక్ట్ అయ్యాడు.

Telangana CM Revanth Reddy reaction on Sai dharam Tej Post

సీఎంలకు సాయి ధరమ్ రిక్వెస్ట్…

సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాగే డిప్యూటీ సీఎం లను కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేయడం జరిగింది. కొందరు మానవ మృగాల నుంచి పిల్లలను కాపాడుకోవాలంటూ, అటు తల్లిదండ్రులను హెచ్చరించగా, అలాగే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, డిప్యూటీ మంత్రులకు తన పోస్ట్ ద్వారా రిక్వెస్ట్ చేశారు సాయి తేజ్. ఆ పోస్ట్ లో సోషల్ మీడియాలో వికృత చర్యలకు పాల్పడే పలు మృగాల నుంచి పిల్లల్ని కాపాడడం కోసం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు చట్టరీత్యా తగిన బుద్ధి చెప్పాలి అంటూ కోరుతూ.. సాయి తేజ్ తెలంగాణ ముఖ్యమంత్రి (CM reaction on SDT Post) రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేసాడు.

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.. యూట్యూబర్ పై కేసు నమోదు…

ఇక సాయి ధరమ్ తేజ్ వేసిన ట్వీట్ కు తెలంగాణ సీఎం కాసేపటికే స్పందించి ట్వీట్ వేశారు. దీనిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధత్య ప్రభుత్వానికి ఉందని, తప్పకుండా వాళ్లపై చర్యలు చేపడతామని, సాయి ధరమ్ తేజ్ కి ఈ విషయాన్నీ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఇక వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో వికృత చర్యలకు పాల్పడిన ఆ యూట్యూబర్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసారు. తండ్రి కూతుళ్ళ బంధంపై తప్పుడు మాటలు మాట్లాడిన ఆ యూట్యూబర్ తో పాటు, ఇతర యూట్యూబర్లపై కూడా కేసు నమోదు చేసారు. ఇక నెటిజన్లు యూట్యూబర్లను అరెస్ట్ చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు