Bigboss 7: భర్తతో కలిసి బిగ్ బాస్ కి ఉదయభాను?

ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకానొక సమయంలో బుల్లితెరపై యాంకర్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఉదయభాను భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. కవితా రీతులను అర్థం చేసుకునే చక్కని కళాకారిని.. అదేవిధంగా తెలుగు పలుకుకు విలువ ఇస్తూ.. ఉచ్చరణ దోషాలు రానివ్వని గొప్ప భాషాభిమాని. అప్పట్లో సాహసం చేయరా డింభకా, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్ వంటి తదితర టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించిన ఉదయభాను.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తన నటనతో, అందంతో మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో 2004లో విజయ్ కుమార్ ని వివాహం చేసుకుంది.

ఆ తరువాత పలు వివాదాలు చుట్టుముట్టడంతో ఒక్కసారిగా సంపాదించిన పేరు మొత్తం పోయింది. ఇక ఇద్దరు ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను.. వారి ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితం అయింది. ఇదిలా ఉంటే.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న ఈ సంవత్సరం కొత్త సీజన్ బిగ్ బాస్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం.

ఈ రియాలిటీ షో ఇప్పటికే 6 సీజన్ లని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు 7వ సీజన్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ షో ప్రారంభానికి రెండు మూడు నెలల ముందే కంటెస్టెంట్ ఎంపిక జరుగుతుందనే విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం షో నిర్వాహకులు కంటెస్టెంట్ ఎంపికలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఎంపిక చేసిన 100 మంది జాబితాలో ఇద్దరు గా ఉదయభాను మరియు ఆమె భర్త నిలిచారట. మరి ఈ రియాలిటీ షో కి ఉదయభాను ఓకే చెబుతుందా లేదా అనే విషయం తెలియదు. కానీ స్టార్ మా వర్గాలవారు మాత్రం ఉదయభాను దంపతులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు