Telugu Movies: హిందీ డైరెక్టర్స్ చేతిలో బకరాలవుతున్న తెలుగు స్టార్స్… ఇక మారరా?

ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూస్తుంటే, తెలుగు హీరోలు మాత్రం బాలీవుడ్ దర్శకుల వైపే చూస్తున్నారు. వాళ్ల చేతిలో బకరాలై పోతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా స్పాన్ పెరిగిపోయింది. రాజమౌళి, సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్స్ తో పాటు వేణు లాంటి చిన్న దర్శకులు కూడా ఇంటర్నేషనల్ అవార్డులు అందుకుంటున్నారు. మనోళ్లు ఆ రేంజ్ లో సినిమాలు తెరకెక్కిస్తుంటే కొంతమంది టాలీవుడ్ హీరోలు మాత్రం బాలీవుడ్ దర్శకుల చేతుల్లో తమ సినిమాలు పెట్టేసి, చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నారు. నిన్న ప్రభాస్, నేడు వరుణ్ తేజ్ ఇలాగే చేశారు. మరి వీళ్ళు ఇక మారరా? ఇంకెప్పుడు నేర్చుకుంటారు మన తెలుగు హీరోలు?

నిన్న ప్రభాస్, నేడు వరుణ్ తేజ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ఆదిపురుష్” మూవీతో దారణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. హిందీ డైరెక్టర్ ఓం రౌత్ దాదాపు 700 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ ఈ మూవీని నాశనం చేశాడు. ప్రభాస్ పై తీవ్ర విమర్శలు వచ్చేలా చేశాడు. మరోసారి ప్రభాస్ హిందీ డైరెక్టర్స్ జోలికి వెళ్లకుండా చేసింది ఈ మూవీ ఫలితం. “ఆదిపురుష్” రిజల్ట్ చూశాక కూడా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మళ్ళీ అదే బాట పట్టాడు. కనీసం ఆలోచన లేకుండా మొదటి పాన్ ఇండియా మూవీనీ బాలీవుడ్ కొత్త డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ చేతిలో పెట్టేసాడు. వరుస ప్లాపుల్లో ఉన్నప్పటికీ తన భవిష్యత్తును అతడికి అప్పగించి, “ఆపరేషన్ వాలెంటైన్”పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. కానీ డైరెక్టర్ మాత్రం తనకు వచ్చిన ఈ అవకాశాన్ని కేవలం బాలీవుడ్ ను ఇంప్రెస్ చేయడానికి వాడుకున్నాడు. ఆయన ఎక్స్పెక్టేషన్ ను కూడా రీచ్ కాలేకపోయాడనుకోండి… అది వేరే విషయం. కానీ వరుణ్ కు ఈ మూవీతో మరోసారి నిరాశ తప్పలేదు. తెలుగు దర్శకులు అందర్నీ వదిలేసి పోయి పోయి ఆ బాలీవుడ్ డైరెక్టర్ ను పట్టుకున్నాడు. ఇక ఇప్పుడు రిజల్ట్ చూసి బాధ పడి ఏం లాభం.

Telugu directors are at the top

- Advertisement -

మన దర్శకులే టాప్…
మాగ్నం ఓపస్ బాహుబలి తెలుగు సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ రూట్ క్రియేట్ చేసింది. జాతీయస్థాయిలో తెలుగు దర్శకులు తమ టాలెంట్ ను నిరూపించుకునే అవకాశాన్ని కలగజేసింది. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, సుజీత్ వంటి బడా దర్శకులతో పాటు ప్రశాంత్ వర్మ, “బలగం” వేణు వంటి యంగ్ డైరెక్టర్స్ కూడా మంచి సత్తా ఉన్న కంటెంట్ తో హీరోలకు హిట్స్ ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునే రేంజ్ కు టాలీవుడ్ ఎప్పుడో వెళ్ళిపోయింది. మరోవైపు బాలీవుడ్ కుప్పకూలిపోయింది. హిందీ హీరోలకు హిట్స్ లేకపోగా, కనీసం ఎలాంటి కంటెంట్ ప్రేక్షకులకు నచ్చుతుంది అనే అంచనా కూడా వెయ్యలేకపోతున్నారు బాలీవుడ్ మేకర్స్.

హనుమాన్‌ బెస్ట్ ఎగ్జాంపుల్…

Telugu directors are at the top
ప్రస్తుతం బాలీవుడ్ బడా హీరోలు అంతా హిందీ దర్శకులను పక్కన పెట్టేసి, తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగు దర్శకులు అందరినీ వదిలేసి, బాలీవుడ్ లో నిరూపించుకోవాలని వరుణ్ ప్రయత్నం చేయడం ఏమిటో ఆయనకే తెలియాలి. ఒకవేళ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలి అనుకుంటే హిందీ దర్శకుడే కావాలా? తెలుగు డైరెక్టర్స్ పాన్ ఇండియా రేంజ్ లో కథను తెరకెక్కించి, ప్రేక్షకులను మెప్పించట్లేదా? డైరెక్టర్ కాదు, భాష అంతకన్నా ముఖ్యం కాదు… కంటెంట్ లో దమ్ము ఉంటే చాలని రీసెంట్ బ్లాక్ బస్టర్ “హనుమాన్”ను చూస్తే అర్థం కాలేదా? మరి వరుణ్ లాంటి హీరోలు ఇలాంటి అవుట్ డేటెడ్ ఆలోచనలతో ఇంకెంత కాలం ఇలా బాలీవుడ్ డైరెక్టర్స్ ని నమ్మి, కెరీర్ ను డేంజర్ లో పెట్టుకుంటారో. ఈ పరిస్థితులను చూశాక ఇప్పటికైనా మన హీరోలు మారితే బెటర్.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు