Harish Sajja: తెలుగు డిస్టిబ్యూటర్ హరీష్ సజ్జా కన్నుమూత..

Harish Sajja: తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.. స్టార్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూశారు. అమెరికాలో తెలుగు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే హరీష్ సజ్జా గుండెపోటుతో ఈరోజు మరణించారు.. ఈ సడెన్ న్యూస్ విన్న చాలా మంది షాక్ అవుతున్నారు…స్టార్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూశారు.. ఈయన తెలుగు ఇండస్ట్రీకి చేసిన సేవలు ఎనలేనివి.. ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లిన ఈయన సినిమాల పై ఆసక్తితో అక్కడ సినిమాలకు డిస్టిబ్యూటర్ గా మారాడు..

అమెరికాలో తెలుగు సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. పెరుగుతున్న డిమాండ్ చూసి అక్కడ తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పని చేశారు.. ఈయన 2006 సంవత్సరంలో ఎన్టీఆర్ రాఖీ సినిమాతో అమెరికాలో హరీష్ సజ్జా డిస్ట్రిబ్యూటర్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రోబో, జనతా గ్యారేజ్ వంటి సినిమాలకు డిస్టిబ్యూటర్ గా వ్యవహారించారు..

Telugu distributor Harish Sajja passes away..
Telugu distributor Harish Sajja passes away..

హరీష్ సజ్జ తెలుగు సినిమాలకు అమెరికాలో డిస్టిబ్యూటర్ గా చేశారు.. ఆయన చేసిన సినిమాలు అన్ని మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఈయన 2006 నుంచి 2016 వరకు తెలుగు సినిమాలకు డిష్టిబ్యూటర్ గా చేశారు.. ఆ తర్వాత వృద్ధాప్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉండిపోయాడు.. ప్రస్తుతం ఆయన అట్లాంటాలో నివసిస్తున్నారు.. నేడు ఉదయం అయన తన నివాసంలోనే గుండెపోటు రావడంతో మరణించారు.. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, డిస్టిబ్యూటర్స్ సంతాపం తెలుపుతున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు