Telugu Film Industry: ఇంత మంది కమెడియన్స్ కేవలం మన ఇండస్ట్రీలోనే ఉన్నారు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు తెలుగు సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కేవలం గొప్ప సినిమాలు మాత్రమే కాకుండా ఎంతోమంది గొప్ప గొప్ప నటులు కూడా ఉన్నారు. మన నటులు చూపించే నటన, చెప్పే డైలాగ్స్ వాయిస్, మాడ్యులేషన్, కామిక్ టైమింగ్ ఇవన్నీ కూడా అత్యద్భుతం అని చెప్పొచ్చు.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది వైవిధ్యమైన నటులు ఉన్నారు. కేవలం నటులు మాత్రమే కాకుండా వైవిధ్యమైన కమెడియన్స్ కూడా ఉన్నారు. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్స్ ఇంకో ఇండస్ట్రీలో లేరు అని చెప్పొచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఒక్కొక్క కమెడియన్ కి ఒక్కొక్క శైలి ఉంటుంది. తెలుగులో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యేకమని చెప్పొచ్చు.

ఇప్పటి తరమే కాకుండా పాతతరం నుంచి కూడా చాలామంది కమెడియన్స్ ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్తూనే ఉంది. అయితే కేవలం వాళ్లు కామెడీ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా మిగతా పాత్రలో కూడా వారిలోని నటన పరిపక్వతను బయటికి తీసిన నటులు ఉన్నారు. అయితే వీళ్ల గురించి కేవలం ఒక్క ఆర్టికల్ లోనే చెప్పలేము అని కూడా చెప్పొచ్చు.

- Advertisement -

ఇక తెలుగు కమెడియన్స్ విషయానికి వస్తే అల్లు రామలింగయ్య, రాజబాబు, రేలంగి, సూర్యకాంతం, సుత్తి వీరభద్రం, నూతన ప్రసాద్, చంద్రమోహన్, మల్లికార్జున్, బ్రహ్మానందం, బాబు మోహన్, ఎల్బీ శ్రీరామ్ ఇలా పాత తరం కమెడియన్స్ అందర్నీ కూడా చెప్పుకొని పోవచ్చు వీరిలో ఒక్కొక్కరి గురించి చెప్పిన కూడా చాలా విషయాలు ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంటాయి.

Telugu Film Industry Comedians

ఇక ఇప్పుడున్న చాలామందికి తెలిసిన ప్రేక్షకుల పేర్లు అని అంటే గిరిబాబు, అలీ, ఏవీఎస్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్, వేణుమాధవ్, సునీల్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, 30 ఇయర్స్ పృథ్వి, గౌతమ్ రాజు, శివాజీ రాజా, ఉత్తేజ్, ఐరన్ లెగ్ శాస్త్రి , గుండు సుదర్శన్ ఇలా చాలామంది ఉన్నారు.

Telugu Film Industry Comedians

ఇకపోతే ఇప్పుడున్న తరంలో కమెడియన్స్ కూడా అంతే ఎక్కువమంది ఉన్నారు. ఇప్పుడు కమెడియన్స్ అంటే శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శీను, హర్షవర్ధన్, మాస్టర్ భరత్, వెన్నెల కిషోర్, సత్య, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వైవ హర్ష, నెల్లూరు సుదర్శన్, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, గెటప్ శీను, షకలక శంకర్ వీరందరి పేర్లను చెప్పొచ్చు. అయితే కేవలం వీరు కమెడియన్స్ మాత్రమే కాదు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా చేసి నిరూపించుకున్న నటులు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసినంతమంది నటులని కమెడియన్స్ ని ఇంకో ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేయలేదని గర్వంగా చెప్పొచ్చు.

 

Telugu Film Industry Comedians

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు