TeluguHeros As Lord Krishna : శ్రీకృష్ణుడిగా వెండితెరపై కనువిందు చేసిన తెలుగు స్టార్ హీరోలు వీరే!

TeluguHeros As Lord Krishna : దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి సంబరాలు మొదలయ్యాయి. భారతీయ హిందూ కాలమానం ప్రకారం ద్వాపర యుగంలో శ్రీముఖ నామ సంవత్సర శ్రావణం మాసంలో ‘బహుళ అష్టమి’ నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీ కృష్ణుడు జన్మించినట్లు ఇతిహాసాల్లో చెప్పబడుతున్నాయి. ఇక భారతదేశంలో విశేషంగా జరుపుకునే పండుగల్లో శ్రీ కృష్ణాష్టమి ఒకటి. ముఖ్యంగా తెలుగు వారికి కూడా ఎంతో ఆరాధ్యనీయుడు శ్రీకృష్ణుడు. ఇక్కడ కృష్ణాష్టమి రోజున ఎంతో మంది చిన్నారులు శ్రీ కృష్ణ గోపికా వేషధారణల్లో సందడి చేస్తూ, ప్రజలందరూ తమకు నచ్చిన విధంగా శ్రీ కృష్ణుడిని ఆరాధిస్తుంటారు. ఇదిలా ఉండగా, తెలుగు నాట సినిమాల పరంగా శ్రీ కృష్ణుడి పాత్రలకు విశేష ఆదరణ ఉంటుంది. ఈ మధ్య పౌరాణిక పాత్రలు తగ్గిపోయాయి కానీ, ఒకప్పుడు రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలకు, చిత్రాలకు తెలుగు చిత్ర పరిశ్రమ పెట్టింది పేరు. ఇక నేడు శ్రీ కృష్ణాష్టమి సందర్బంగా, వెండితెరపై శ్రీ కృష్ణుడిగా కనిపించిన తెలుగు హీరోల (TeluguHeros As Lord Krishna) గురించి తెలుసుకుందాం.

వెండితెరపై శ్రీ కృష్ణుడిగా కనువిందు చేసిన హీరోలు…

ఎన్టీ రామారావు (NT Rama Rao)

తెలుగు సినిమాల్లో శ్రీ కృష్ణుడు అంటే ముందుగా గుర్తొచ్చేది నటరత్న ఎన్టీ రామారావు. ఆయన శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడి పాత్రలకు పెట్టింది పేరు. ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌ లో, దాదాపు 20 కి పైగా చిత్రాలలో శ్రీకృష్ణుడి పాత్రను పోషించాడు. శ్రీ కృష్ణార్జున యుద్ధం, శ్రీ కృష్ణ తులాభారం, కర్ణన్, దాన వీర శూర కర్ణ లాంటి చిత్రాలు అఖండ విజయాలు సాధించాయి.

కాంతారావు (Kantha rao)

ఎన్టీ రామారావు తర్వాత శ్రీకృష్ణుడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఘనత కాంతారావుదే. నారదుడి పాత్రలకు కాంతారావు పెట్టింది పేరు కానీ, శ్రీ కృష్ణుడిగా కూడా చాలా సినిమాల్లో కాంతారావు నటించారు. ఆ రోజుల్లో పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ తన సినిమాల్లో కృష్ణుడు కాకుండా ఇతర పాత్రల్ని వేయాల్సి వస్తే.. శ్రీ కృష్ణుడి పాత్రను కాంతారావు వేసేవారు. అలా శ్రీ కృష్ణ పాండవీయం, పాండవ వనవాసం, నర్తనశాల వంటి చిత్రాల్లో కాంతారావు శ్రీ కృష్ణుడిగా నటించారు.

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna)

నటశేఖర కృష్ణ అర్జునుడి పాత్రలు ఎక్కువగా చేయగా , ఆయన తొలిచిత్రం సాక్షి లో శ్రీ కృష్ణుడిగా కాసేపు కపినించారు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా పాటల్లో కాసేపు శ్రీ కృష్ణుడిగా కనిపించారు కృష్ణ.

శోభన్ బాబు (Shobhan Babu)

ఆరోజుల్లో ఎన్టీఆర్ ఆతర్వాత శోభన్ బాబుని అందగాడుగా సినీ ప్రియులు పిలిచేవారు. ఇక శ్రీ కృష్ణుడిగా శోభన్ బాబు కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. బుద్ధిమంతుడు, కురుక్షేత్రం వంటి చిత్రాల్లో శోభన్ బాబు శ్రీ కృష్ణుడిగా నటించి మెప్పించారు.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)

రెండో తరం అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుని పౌరాణికాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగా, శ్రీ కృష్ణార్జున విజయం, పాండురంగడు, వంటి చిత్రాల్లో శ్రీ కృష్ణుడిగా నటించి మెప్పించాడు.

రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)

రాజేంద్ర ప్రసాద్ కూడా కన్నయ్య కిట్టయ్య అనే చిత్రంలో శ్రీ కృష్ణుడిగా నటించి మెప్పించారు. అలాగే లేడీస్ టేలర్ సినిమాలో ఓ పాటలో కృష్ణుడిగా కనిపించారు.

ఇక కింగ్ నాగార్జున (Nagarjuna) కృష్ణార్జున అనే చిత్రంలో మోడ్రన్ శ్రీ కృష్ణుడిగా కనిపించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కూడా గోపాల గోపాల చిత్రంలో మోడ్రన్ శ్రీ కృష్ణుడిగా నటించారు. అయితే వీరు ఆ సినిమాల్లో పౌరాణిక వేషధారణల్లో కనిపించలేదు. ఇక యువరాజు సినిమాలో మహేష్ బాబు (Mahesh babu) కూడా ఓ సాంగ్ లో శ్రీ కృష్ణుడిగా కనిపించి కనువిందు చేసాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు