Telugu producers: అప్పుడు నిలబడ్డారు ఇప్పుడు ప్రాధేయ పడుతున్నారు

Telugu producers: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నరేంజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుసగా ఏడు హిట్ సినిమాలు తర్వాత పదేళ్లపాటు ఒక్క హిట్ సినిమా కూడా లేకపోయినా ఈ ఎంకరేజ్ పెరుగుతూ వచ్చింది తప్ప ఇంచు కూడా తగ్గలేదు. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక పండగ రకమైన వాతావరణం ఉంటుంది. రోడ్లు నిండుగా ట్రాఫిక్ జామ్ అయ్యేది ఒకప్పుడు. అయితే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో 25 సినిమాలు చేసిన తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన కొన్నేళ్లపాటు సినిమాకి గ్యాప్ ఇచ్చాడు. ఆ తరువాత వరుసగా మూడు సినిమాలు చేశాడు. అయితే ఆ మూడు సినిమాలు కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ మాత్రం నిరాశపరిచాయి. దీనికి కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండి అధికార పార్టీ పైన కొన్ని ప్రశ్నలు లేవనెత్తడంతో పవన్ కళ్యాణ్ సినిమాలను అధికార పార్టీ టార్గెట్ చేసింది.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ వలన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో సినిమా ఇండస్ట్రీకి గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసి టికెట్ రేట్లను విపరీతంగా తగ్గించి తెలుగు సినిమా పరిశ్రమకు కొంత నష్టాన్ని మిగిల్చింది. అయితే ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కొన్ని ముందు అడుగులు వేయనున్నారు.

Telugu film producers meet Pawan Kalyan

- Advertisement -

రేపు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు.కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరనున్నారు. మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారితో చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసే వారిలో అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ,రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్,తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు