Kanguva Fire Song : అరవం స్మెల్ – ప్రతీ సారి అదే మిస్టేక్… కంగువలోనూ అదే తీరు

Kanguva Fire Song : ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమాకు సంబంధించి భాషా పరిమితులు లేవు. ఏ భాషా అయినా, ఆధరిస్తున్నారు. హిట్ చేస్తున్నారు. నిర్మాతల జేబుల్లో కోట్ల రూపాయలు చేరేలా చేస్తున్నారు సినిమా లవర్స్.

మలయాళం సినిమాలకు తెలుగులో ఉండే ఫ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని మలయాళ సినిమాలు…. అక్కడ కంటే, తెలుగులో భారీ స్థాయిలో హిట్ అయ్యాయి. కన్నడ సినిమాలకు కూడా అదే జరిగింది. అయితే, కోలీవుడ్ కు వచ్చే సరికి… పరిస్థితి చిరాకు పెట్టేలా ఉంది. దీనికి కారణం.. అరవం స్మెల్.

పాన్ ఇండియా సినిమా అయినా, వారి నెటివిటీని కావాల్సిన దాని కంటే, ఉండాల్సిన దాని కంటే ఎక్కువ రుద్దుతున్నారు. ప్రాంతీయ సినిమాలకు ఈ నెటివిటీ ఎంత ఉన్న పర్లేదు. కానీ, పాన్ ఇండియా మూవీ అని ముద్ర వేసి… మార్కెట్ లోకి వదిలే టైంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకోకపోవడం వల్ల తమిళంలో వచ్చిన భారీ పాన్ ఇండియా సినిమాలు ఇతర భాషా ఆడియన్స్ మెప్పించలేకపోతున్నాయి.

- Advertisement -

PS 1 & PS 2

మణిరత్నం… డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఇది రెండు పార్టులకుగా వచ్చింది. తమిళనాట ఉన్న బిగ్ స్టార్స్ అందరూ ఈ కళాకండంలో కనిపించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. కానీ, సినిమా మొత్తం తమిళ నెటివిటీలోనే ఉంది. దీంతో ఇతర భాషా ఆడియన్స్ కి పొన్నియన్ సెల్వన్ అసలు అర్థం కాలేదు. దీంతో మణిరత్నం డ్రీ ప్రాజెక్ట్ కాస్త డిజాస్టర్ ప్రాజెక్ట్ అయిపోయింది.

ఒక్క పొన్నియన్ సెల్వన్ మాత్రమే కాదు… కెప్టెన్ మిల్లర్, లాల్ సలాం తో పాటు చాలా సినిమాల్లో ఈ తమిళ నెటివిటీ ఎక్కువ ఉండటం వల్ల తెలుగు ఆడియన్స్ తో పాటు ఇతర భాషా సినీ లవర్స్.. ఆయా సినిమాలకు దూరంగా ఉన్నారు.

మెప్పించినవీ ఉన్నాయి…

కొంత మంది దర్శకులు దీన్ని అర్థం చేసుకున్నారు. అందుకే, ఖైదీ, విక్రమ్, లియో, మహారాజా, జైలర్ వంటి సినిమాల్లో తమిళ నెటివిటీ ఎక్కువ ఉండకుండా చూసుకున్నారు. ఈ హిట్ అయిన సినిమాల్లో కూడా తమిళ నెటివిటీ ఉంది. కానీ, ఇతర భాషా ఆడియన్స్ చిరాకు పెట్టేలా మాత్రం లేదు.

ఇప్పుడు కంగువ…

ఇప్పుడు సూర్య నటించిన కంగువ సినిమా నుంచి ఫైర్ సాంగ్ వచ్చింది. ఫస్ట్ తమిళ వెర్షన్ వచ్చింది. అది… సినిమాపై హైప్ పెంచింది. కొద్ది టైంలోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రశంసలు దక్కాయి. కానీ, కాసేపటి క్రితం ఇదే సాంగ్ తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన టాక్ మొత్తం రివర్స్ అయింది.

Surya's Kanguva: Fire appeared in Fire Song, this is what Devi wanted
Surya’s Kanguva: Fire appeared in Fire Song, this is what Devi wanted

తెలుగు లిరిక్స్ ఏ మాత్రం ఊపునిచ్చేలా లేవు. తమిళ సాంగ్ విన్న టైంలో వచ్చిన ఊపు… తెలుగు వెర్షన్ విన్నప్పుడు రాలేదు. రెండింటిలో దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఒక్కటే మెప్పించింది. అంతే కానీ, దేనికి కూడా ప్లస్ పాయింట్స్ రావడం లేదు. ఈ తెలుగు లిరిక్స్ వల్ల… సూర్య యాక్టింగ్ కూడా తెలిపోయింది అనేది వాస్తవం.

ఇంకా సాంగ్ లో ఓ హైలైట్ సీన్ ఉంటుంది. అది తమిళ వెర్షన్ విన్న తర్వాత వచ్చిన ఫీల్.. తెలుగు వెర్షన్ విన్న తర్వాత రావడం లేదు. ఈ సాంగ్ తర్వాత, కంగువ మూవీ కూడా అరవం స్మెల్‌తో నే ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అదే జరిగితే 1000 కోట్ల అంచనాలు పెట్టుకున్న మూవీపై నెగిటివ్ కామెంట్స్ రాలేకపోతాయా..? .

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు