God Father : బాసుల డాన్స్ కు ఇండస్ట్రీ షేక్

ఆచార్య పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం గాడ్ ఫాదర్, బోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు. మలయాళం లో వచ్చిన లూసీఫర్ కు గాడ్ ఫాదర్ తెలుగు రీమేక్ అని తెలిసిందే. గాడ్ ఫాదర్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది.

దీని కోసం ప్రమోషన్లను భారీగా చేయాలని టీం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్లు విడుదలయ్యాయి. ఇవి ప్రేక్షకులపై పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమా నుంచి ఆయా పాత్ర ప్రాధాన్యతను బట్టి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్స్ ను వదులుతూ వెళుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ ఇవాళ రిలీజ్ అయింది. ఈ సాంగ్ “బాస్ లు వచ్చిండ్రే.. బేసులు పెంచిండురే” అంటూ ఈ పాట మొదలైంది. “తార్ మార్ తక్కర్ మార్” అంటూ సాగే ఈ పాటకి చిరు-సల్మాన్ వేసే స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాటకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించగా, కొరియోగ్రఫీ శాండీ. ఈ సాంగ్ నీ ప్రభుదేవా మాస్టర్ డైరెక్షన్ చేశారు. ఈ ఒక్క సాంగ్ తో చెప్పేయవచ్చు మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అనేది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు