Ajith : 22 గంటలు సెట్స్ లోనే.. ఏకంగా మూడు షిఫ్ట్ లు..

Ajith : కోలీవుడ్ స్టార్ థలా అజిత్ వరుస షూటింగ్ లతో బిజీ అవుతున్నాడు. తూనీవు సినిమా తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన అజిత్ ఆ తర్వాత వరుస సినిమాలను లైన్లో సంగతి తెలిసిందే. అది కూడా రీసెంట్ గా ఓ ఆరు నెలల కిందే అన్ని సినిమాల షూటింగులు స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం అజిత్ హీరోగా ‘విదా మ‌యూర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలు తెర‌కెక్కుతోన్న‌ సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు రెగ్యులర్ గా షూట్ జరుపుకుంటున్నాయి. ఇక ఇందులో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక విదా మ‌యూర్చి చిత్రాన్ని అక్టోబ‌ర్ లో రిలీజ్ చేస్తున్న‌ట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు కూడా.

Thala Ajith is working 22 hours a day participating in two shootings

ఒకే రోజు రెండు సెట్స్ లో…

ఇక అజిత్ విదా ముయార్చి రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేయడంతో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఒకే సారి రెండు సినిమాలకు డేట్లు కేటాయించి షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒకేరోజు రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నాడని చెప్పాలి. మొత్తంగా థలా ఒక డే మొత్తంలో 22 గంట‌ల పాటు కూడా ప‌నిచేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ఈ రెండు సినిమాల షూటింగ్ లు ఒకేసారి హైద‌రాబాద్ లోనే జరుగుతుండడంతో అలా ప్లాన్ చేసి ముందుకెళ్తున్నారు. అవ‌స‌రమైన వరకు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నా కూడా,జ‌ర్నీలు చేసి మరీ షూట్ చేస్తున్నారట. దీంతో అజిత్ డెడికేషన్ ఎలా ఉంటుందో చూసి నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

అజిత్ డెడికేషన్ పై ప్రశంసలు…

అయితే ఈ రోజుల్లో ఒకే రోజు రెండు సినిమాల సెట్స్ లో పాల్గొనడం చాలా అరుదు. అసలు రెండు, మూడు సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లడం కూడా జరగడం లేదు. ఒకప్పుడు చిరంజీవి, రజినీకాంత్ లాంటి స్టార్లు వరుసగా ఒకే ఏడాదిలో అరడజను సినిమాలు రిలీజ్ చేసిన రోజులున్నాయి. ఈ జెనరేషన్ లో అంటే ఎక్కడో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లాంటి నటులు తప్ప, స్టార్ హీరోలైతే ఎవరూ అంత స్పీడ్ గా సినిమాలు చేయడం లేదని చెప్పాలి. ఇక అజిత్ నటిస్తున్న విదా ముయార్చి షూటింగ్ తుదిదశకు చేరుకోగా, గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు