Thalapathy 68 : సీనియర్ లేదా జూనియర్…

‘వారసుడు’ సినిమాతో సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు విజయ్ తలపతి. తమిళతో పాటు తెలుగు, హిందీలో కూడా రిలీజ్ కానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. మంగళవారం రిలీజ్ అయిన ‘సోల్ అఫ్ వారిసు’ అనే ఎమోషనల్ సాంగ్ కి ఫాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మదర్ సెంటిమెంట్ తో సాగె ఈ సాంగ్ లిరిక్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

దీని తర్వాత తలపతి తన 67వ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే తలపతి 68 పై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాకు కోసం ఇద్దరు దర్శకులు పోటీ పడుతున్నారని తెలుస్తుంది.

రాజా రాణి సినిమాతో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు అట్లీ. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ తమిళ స్టార్ డైరెక్టర్. అట్లీ మరియు విజయ్ కాంబినేషన్ గురంచి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్ గా నిలిచాయి. తలపతి 68 కోసం విజయ్ కి అట్లీ ఒక స్టోరీ చెప్పారట.

- Advertisement -

ఇది ఇలా ఉండగా లవ్ టుడే సినిమాతో స్టార్ డైరెక్టర్ రేంజ్ కి ఎదిగారు దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌. ఒక సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కోసం ప్రదీప్ తో విజయ్ సినిమా సైన్ చేసాడని చర్చ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ తలపతి 68గా రాబోతుందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

మరి తలపతి68కి సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తాడా ? లేదా ఒక్క సినిమాతోనే సౌత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ ఛాన్స్ దక్కించుకుంటాడా అనే ఉత్కంఠ విజయ్ ఫ్యాన్స్ లో ఉంది. మరి ఇది తెలియాలంటే తలపతి68 అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు