Thalapathy Vijay : ఆల్ ఇండియా నెం.1 హీరో

దేశంలో సౌత్ సినిమా హవా నడుస్తుంది. ఇప్పటికే కొన్ని సందర్బాల్లో ఇది నిజమైంది. సౌత్ తో పాటు హిందీ బెల్ట్ రాష్ట్రాల ప్రేక్షకులు సౌత్ సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. మొన్నటి బాహుబలి నుండి నేటి కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ వరకు ఎన్నో సినిమాలు దీనికి ఉదాహరణ. దేశ వ్యాప్తంగా సినీ లవర్స్ సౌత్ సినిమాలకే కాదు. సౌత్ సినీ స్టార్స్ పై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

దేశంలోని ప్రముఖ మీడియా కంపెని ORMAX ప్రతి నెల దేశంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన స్టార్ హీరోల లీస్ట్ ను విడుదల చేస్తుంది. తాజా గా మే నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరోల లీస్ట్ ను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మొదటి స్థానంలో ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ గా ట్యాగ్ తెచ్చుకున్న ప్రభాస్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కేజీఎఫ్ చాప్టర్ 2 సూపర్ విక్టరీ కొట్టిన యష్ మూడో స్థానంలో నిలిచాడు. తర్వాత స్థానాల్లో అజిత్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, తారక్, మహేష్ బాబు, రామ్ చరణ్, సూర్య ఉన్నారు.

అయితే ORMAX లీస్ట్ లో మొదటి స్థానంలో ఉన్న దళపతి విజయ్ కి చివరి సినిమా బీస్ట్ చేదు అనుభవాన్ని ఇచ్చింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ విజయ్ ఫ్యాన్స్ ను నిరాశపర్చింది. అయినా, తొలి స్థానంలో విజయ్ ఉండటం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు