Thalapathy Vijay: ఇంకో పార్టీ జెండాను నా అభిమానులుతో మోయనివ్వను,పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేసాడా.?

Thalapathy Vijay: శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు తలపతి విజయ్. అయితే అంతకుముందు విజయ్ చాలా సినిమాలు చేసినా కూడా తెలుగు వాళ్లకి పెద్దగా పరిచయం లేదు. విక్రమ్, విశాల్, సూర్య వంటి తమిళ్ నటులు మాత్రమే తెలుగు ప్రేక్షకులకు అప్పట్లో బాగా పరిచయం. ఇక రజనీకాంత్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్లు పరభాష నటులని ఏ రోజు అనిపించలేదు.

స్నేహితుడు సినిమా తర్వాత విజయ్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చాయి. ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ సినిమాకి ప్రమోషన్ కి కూడా హైదరాబాద్ కు వచ్చాడు విజయ్. ఇక ప్రస్తుతం తెలుగులో విజయ్ కి కూడా మంచి మార్కెట్ ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమాను కూడా చేశాడు విజయ్. అయితే విజయ్ తన మార్కెట్ ను తెలుగులో సరిగ్గా వాడుకోవట్లేదు అని అందరికీ తెలిసిందే. ఆ సినిమా తెలుగులో రిలీజ్ అవుతున్న కూడా తెలుగు ప్రమోషన్స్ కి హాజరు కాడు విజయ్.

Thalapathy Vijay

- Advertisement -

ఇక రీసెంట్ గా తలపతి విజయ్ ఒక రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ పేరు తమిళ వెట్రి కళగం. ఈ పార్టీకి సంబంధించిన జెండాను నిన్ననే ఆవిష్కరించాడు విజయ్. అయితే దీనిలో విజయ్ మాట్లాడుతూ గెలిచినా ఓడిన ఒంటరిగానే ప్రయాణిస్తాను. నా ఫ్యాన్స్ తో ఇంకో పార్టీ జెండాను మోయనవ్వను అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ కామెంట్స్ విజయ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేశాడా అంటూ కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఎటువంటి పరిస్థితుల్లో వేరే పార్టీతో కలవాల్సి వచ్చిందో కొత్తగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు