Kaithi2 : ఢిల్లీ కోసం మరో స్టార్ ను దించిన లోకి..

Kaithi2 : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ స్టార్ డైరెక్టర్ కు ఉన్నంత క్రేజ్ గాని, డిమాండ్ గాని ఎవరికీ లేవని తెలిసిందే. ఎప్పుడైతే ఖైదీ సినిమా చేసాడో… ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీటితో బ్లాక్ బస్టర్ కొట్టగా, ప్రతి సినిమాని తన సినిమాటిక్ యూనివర్స్ తో లింక్ చేసి తరువాత రాబోయే సినిమాలపై హైప్ భారీగాపెంచేసాడు. అయితే ఇప్పటికే చాలా సినిమాలు రాగా, వాటికి సంబంధించిన రెండో పార్ట్ పై లేట్ అవుతుందని మూవీ లవర్స్ అంటున్నారు. లోకేష్ కానగరాజ్ తీసిన ఖైదీ, విక్రమ్, సినిమాలతో పాటు విక్రమ్ లో రోలెక్స్ పాత్రకి సంబంధించి కూడా ఓ సినిమా రావాల్సి ఉంది. మరి ఈ డైరెక్టర్ రానున్న రోజుల్లో, ఎన్ని రోజుల్లో ఈ సినిమాలు పూర్తి చేస్తాడో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Thalapathy Vijay is doing the voice over for Karthi's Kaithi2

ఎట్టకేలకు ఖైదీ2 కి రెడీ…

ఇక లోకేష్ కానగరాజ్ సినిమాల్లో అందరూ ఎదురుచూస్తున్న సినిమా మాత్రం ఖైదీ2. సెట్స్ పై వేరే సినిమాల సీక్వెల్ కూడా రావాల్సి ఉన్నా, ఖైదీ2 (Kaithi2) పైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఖైదీ2 అతి త్వరలోనే మొదలు కానుందని తెలుస్తుంది. ఖైదీ ఫస్ట్ పార్ట్ లో ఢిల్లీ జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఆ సన్నివేశాలని సినిమాగా చూపించారు. అయితే జైలులోకి వెళ్ళడానికి కారణమేంటి? అసలు జైలులో ఢిల్లీ ఏం చేసాడు అనేది రెండో పార్ట్ లో చూపించబోతున్నారు. ఇక విక్రమ్ లో ఢిల్లీ ఉత్తర ప్రదేశ్ లో ఉన్నట్టు చూపించిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఢిల్లీ కోసం మరో స్టార్ ని దించుతున్న లోకి?

ఇక ఖైదీ పార్ట్2 ని త్వరలోనే స్టార్ట్ చేయనుండగా, ఖైదీ కోసం మరో స్టార్ ని రంగంలోకి దించుతున్నాడట లోకి. ఖైదీ2 కోసం లోకేష్ కానగరాజ్ లియోసాయం తీసుకోనున్నాడట. అయితే సినిమాలో కాదు.. సినిమా వెనక. ఖైదీ2 కోసం తలపతి విజయ్ తో లోకేష్ కనగరాజ్ వాయిస్ ఓవర్ ఇప్పించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అది మామూలుగా విజయ్ లా కాకుండా లియో పాత్ర లా డబ్బింగ్ చెప్పించబోతున్నారట. అయితే సినిమాలో కూడా ఉంటాడా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సింది. ఇక ప్రస్తుతం సర్దార్2 సీక్వెల్ లో ఉన్న కార్తీ, ఈ సినిమా కూడా వెంటనే మొదలు పెట్టి, రెండు సినిమాల షూటింగ్ లలో ఒకేసారి పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరి ఈ వార్తలకి సంబంధించి క్లారిటీ మేకర్స్ నుండే రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు