Thalapathy Vijay : లాస్ట్ సినిమా అన్నాడు.. ఇకనైనా మారతాడా.. లేకా?

Thalapathy Vijay : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాట రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్టార్ గా ఎదిగి, ఇళయ దళపతిగా అభిమానులని అలరిస్తున్నాడు. అయితే అది తమిళనాడు వరకే పరిమితమయింది. తన తోటి స్టార్లయిన సూర్య, ధనుష్ వంటి స్టార్స్ ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కాని విజయ్ మాత్రం తన రొటీన్ యాక్టింగ్ తో కొత్తదనం లేని కథలతోనే మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. చివరగా హిట్ అయిన కొన్ని సినిమాలు సక్సెస్ అయినా తన నటనలో ఏమాత్రం మెప్పించలేదు. పైగా ప్రతి సినిమాలో అవసరం లేని చోట కూడా హీరోయిజం పండించే సీన్లు పెట్టిస్తున్నాడు. అసలు విషయమేమిటంటే విజయ్ (Thalapathy Vijay) తాజాగా ఓ రాజకీయ పార్టీ ని స్థాపించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ లాస్ట్ సినిమా అని ప్రచారం జరుగుతున్న క్రమంలో “గోట్” సినిమా రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది.

Thalapathy Vijay is trolled on social media

నెట్టింట భారీ ట్రోలింగ్..

అయితే తాజాగా విజయ్ నటించిన “ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం” (The GreatestOfAllTime) సినిమా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. పైగా విజయ్ నటన పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. నటన, డాన్స్ పైన నెట్టింట దారుణంగా ట్రోలింగ్ వస్తుండగా, కథల ఎంపిక పైనా నెగిటివిటీ వస్తుంది. కెరీర్ లో చివరిగా రెండు సినిమాలు మాత్రమే చేస్తున్న విజయ్ గొట్ లో తెలిసి తెలిసి ఇంత వరస్ట్ సినిమా ఎలా చేసాడని ఫ్యాన్స్ సైతం ఫీల్ అవుతున్నారు. అయితే పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత గోట్ సినిమా రిలీజ్ కావడంతో మరింత ట్రోలింగ్ జరుగుతుంది. ఇది విజయ్ రాజకీయ పార్టీ పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

ఇకనైనా మారతాడా?

అయితే కొన్ని నెలల కింద గోట్ (Goat) సినిమాయే లాస్ట్ అని అనుకున్నా, ఇప్పుడు లాస్ట్ సినిమాగా హెచ్.వినోద్ (H. Vinoth) తో కలిసి ఓ యాక్షన్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ఆల్రెడీ మొదలైపోగా, ఇప్పుడైనా విజయ్ మారతాడా? డీసెంట్ గా మంచి పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తాడా లేదా? అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే చివరి సినిమా అని అంటున్నారు కాబట్టి, రాజకీయ పార్టీని నడిపిస్తున్న ఈ సమయంలో అభిమానులకు, ప్రేక్షకులకు మరిచిపోలేని సినిమా ఇవ్వాలి. ముఖ్యంగా ట్రోలింగ్ బారిన పడకుండా, ఒక తుపాకీ లాంటి సినిమా ఇస్తే మంచిదని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. మరి లాస్ట్ సినిమా అంటూ వస్తున్న, తన నెక్స్ట్ సినిమాకి అయినా విజయ్ తన పంథాని మార్చుకుంటాడా లేదా, మళ్ళీ అదే పనిగా హీరోయిజం, ఎలివేషన్ల పేరిట విమర్శలు మూటగట్టుకుంటాడా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు