Vijay Thalapathy: కొడుకు డెబ్యూకి గ్రాండ్ ప్లాన్….కానీ, డిజాస్టర్ హీరోతో ఎలా సాధ్యం….?

 

Vijay Thalapathy: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నాడు. తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా…. హీరో విజయ్ కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జాసన్ సంజయ్ (Jason Sanjay) విద్యాభ్యాసం కెనడాలో పూర్తి చేసుకున్నారు. సంజయ్ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి సింగర్ కూడా. అతి చిన్న వయసులోనే విజయ్ నటించిన పోఖిరి చిత్రంలో వసంతముల్లై పాటతో పాటు వేడేత్తకారన్ సినిమాలో నాన్ ఆడిచా తంగమాట వంటి ఎన్నో పాటలు పాడారు. తాజాగా సంజయ్ లైకా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమైనట్లు టాక్.

- Advertisement -

ఇక జాసన్ పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెస్ చెబుతూ లైకా ప్రొడక్షన్స్ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టును విడుదల చేసింది. ఇందులో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వైపు ఆసక్తి చూపిస్తున్నాడని హీరో దళపతి గతంలో వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరోతో ఓ సినిమా చేయాలని విజయ్ కుమారుడు సంజయ్ నిర్ణయించుకున్నాడట. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తో (Sandeep kishan) విజయ్ కుమారుడు సినిమా ప్లాన్ చేస్తున్నారట.

Thalapathy' Vijay's Son To Direct Sandeep Kishan! - TrackTollywood

వాస్తవంగా సందీప్ చేసిన ఊరు పేరు భైరవకోన సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన రాయన్ సినిమాతో సందీప్ అందరిని మెప్పించాడు. కానీ ఇప్పటికీ సందీప్ డిజాస్టర్ హీరోగానే కొనసాగుతున్నాడు. మరి అలాంటి డిజాస్టర్ హీరోతో విజయ్ కుమారుడు సినిమా చేయాలని అనుకుంటున్నాడట. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాతో జాసన్ సంజయ్ మంచి గుర్తింపుని తెచ్చుకుంటాడని విజయ్ అభిమానులు ఆశిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు