Greatest Of All Time : ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్.. ఇక సినిమాని డిసైడ్ చేసేది ఇదే!

Greatest Of All Time : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా ‘ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం’ సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేయగా, సాంగ్స్ మాత్రం అంతగా మెప్పించలేకపోతున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ సాంగ్ అయితే బాగా ట్రోల్ అవుతుంది. ఆ సాంగ్ లో విజయ్ (Thalapathy Vijay) డాన్స్, అలాగే లుక్స్ చాలా ట్రోల్ అవుతున్నాయి. అయితే పాటల వల్ల సినిమాపై అంచనాలు తగ్గాయని చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్ళీ తమ ప్రమోషన్లతో జోరు పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు మేకర్స్.

Thalapathy Vijay starrer Greatest Of All Time movie trailer update

ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్…

ఇక కోలీవుడ్ లో ఇప్పుడు రాబోయే బడా సినిమా ఏది అంటే అది విజయ్ ‘గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం’ అనే చెప్పాలి. అయితే సాంగ్స్ తో సినిమాపై అంచనాలు మాత్రం కాస్త తగ్గిపోగా, ఇప్పుడు ప్రమోషన్లతో సినిమాపై ఎలాగైనా హైప్ పెరిగేలా ట్రై చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఫైనల్ గా అభిమానులు ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ గోట్ మేకర్స్ అందించారు. గోట్ సినిమాకు సంబంధించి ఫైనల్ గా ట్రైలర్ రిలీజ్ అప్డేట్ ని మేకర్స్ తాజాగా ఒక అనౌన్స్ చేసారు. గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం చిత్రం యొక్క ట్రైలర్ ను ఆగస్టు 17 వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

సినిమాని డిసైడ్ చేసేది ఇదే!

ఇక గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం సినిమాకు ముందునుండి కాస్త నెగిటివిటి సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. టీజర్ అంతంత మాత్రమే ఉండగా, సాంగ్స్ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి. పైగా డైరెక్టర్ వెంకట్ ప్రభు గత చిత్రాల ప్రభావం దీనిపై పడింది. వీటన్నిటికీ సమాధానం చెప్తూ, సినిమాపై అంచనాలను పెంచే అసలైన ప్రమోషన్ ట్రైలర్ పైనే ఉంది. క ట్రైలర్ అప్డేట్ ని పోస్టర్ ద్వారా చెప్పగా, ఆ పోస్టర్ లో గుండాలను గన్ తో కాలుస్తున్న విజయ్ లుక్ చాలా ఇంటెన్స్ గా ఉండి ఆకట్టుకుంటుంది. మరి ట్రైలర్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు