Thaman: నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు మల్టీ స్టారర్ , కథ కూడా సిద్ధం

Thaman: ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మల్టీ స్టారర్ సినిమాలో వచ్చేవి. ఆ తర్వాత కాలంలో అవి పూర్తిగా తగ్గిపోయాయి. మీ హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఆర్గ్యుమెంట్స్ కూడా మొదలయ్యేవి. అయితే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగులో మళ్లీ మల్టీస్టారర్ సినిమాలకి పూర్వ వైభవం వచ్చింది. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మళ్లీ మల్టీ స్టారర్ సినిమాలు తెలుగులో రావడం మొదలయ్యాయి.

చాలామంది సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. మొదటి విక్టరీ వెంకటేష్ మహేష్ బాబుతో కలిసి నటించిన తర్వాత, రామ్ హీరోగా చేసిన మసాలా సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలో కూడా కనిపించాడు. సీనియర్ హీరోస్ లో మల్టీస్టారర్ సినిమాలు ముందు మొదలుపెట్టింది విక్టరీ వెంకటేష్. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా కూడా రవితేజతో నటించారు. నాగార్జున కూడా నాని హీరోగా చేసిన దేవదాసు సినిమాలో నటించారు.

ఇక ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఒక మల్టీ స్టారర్ సినిమా చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు వీరిద్దరూ కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే రీసెంట్గా జరిగిన తెలుగు ఇండియన్ ఐడల్ షో తమన్ మాట్లాడుతూ ఒక అప్డేట్ ఇచ్చాడు. దీనిలో హోస్ట్ శ్రీరామచంద్ర మహేష్ బాబుతో మీకు సినిమా ఓకే అయింది, నందమూరి బాలకృష్ణ గారితో సినిమా ఓకే అయింది ఇద్దరి ప్రాజెక్ట్స్ లో ఒకరి ప్రాజెక్టు చేయమంటే ఎవరి ప్రాజెక్ట్ చేస్తారు అని అడిగారు. దీనికి సమాధానంగా ఇద్దరికీ కలిపి మల్టీస్టారర్ చేస్తాను అని చెప్పారు. దీనికి సంబంధించిన కథ కూడా విన్నాను ప్రాసెస్ లో ఉంది అని చెప్పుకొచ్చారు థమన్.

- Advertisement -

Mahesh Babu Venkatesh

సూపర్ స్టార్ మహేష్ బాబు నందమూరి బాలకృష్ణ సినిమా చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నారు. ఒక సరైన కథ దొరికితే మహేష్ బాబు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది ఏ హీరో అయినా కూడా చూడరు. ఇదివరకే వెంకటేష్ తో చేసిన మహేష్ ఇక బాలయ్యతో ఎప్పుడు చేస్తారని నందమూరి అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఏమైనా దీని గురించి అధికారక ప్రకటన వచ్చేంతవరకు మనం ఏది డిసైడ్ చేయలేము. అయితే వీరిద్దరినీ డీల్ చేయగల దర్శకుడు ఎవరు అని అందరికీ క్యూరియాసిటీ మొదలైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు