GameChanger : వేడెక్కిపోయి ఉన్నారు.. ఇలా చేయడం వల్ల ఉపయోగమేంటి అంటున్న థమన్..

GameChanger : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ షణ్ముగం (Shankar Shanmugam) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న “గేమ్ ఛేంజర్” కోసం చరణ్ అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ ఆతృత కాస్తా ఆవేశంగా మారిపోతుంది. టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల సినిమాలు ఈపాటికే రిలీజ్ అయిపోయాయి. ఇక తారక్ సినిమా మరో మూడు వారాల్లో రిలీజ్ అయిపోతుంది. కానీ రామ్ చరణ్ (Ramcharan) గేమ్ ఛేంజర్ సినిమా మొదలుపెట్టి కూడా మూడున్నరేళ్లు దాటింది. చరణ్ షూటింగ్ అయిపోయిందని ఆరు నెలల నుండి చెప్తూ.. ఇంకో వారం షూటింగ్ మాత్రమే బాకీ ఉందంటూ, నెలల తరబడి చెప్తూ సాగదీస్తున్నారు మేకర్స్.

Thaman requesting to Ram Charan fans

వేడెక్కిపోయి ఉన్న అభిమానులు..

అయితే గేమ్ ఛేంజర్ షూటింగ్ సంగతి ఎలా ఉన్నా.. కనీసం అప్డేట్స్ కూడా సరిగా ఇవ్వడం లేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్, ఒక లిరికల్ సాంగ్ మినహా మరే అప్డేట్ కూడా రాలేదు. ఈ క్రమంలో చరణ్ ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై సోషల్ మీడియాలో పలుమార్లు ఫైర్ అయ్యారు. అయినా మేకర్స్ లో చలనం లేకుండా పోయింది. ఇక ఈ వినాయకచవితికి గేమ్ ఛేంజర్ (GameChanger) అప్డేట్ వస్తుందని వార్తలు వస్తున్నా, మేకర్స్ నుండి ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు. పైగా ఆగస్ట్ చివరి వారంలో అప్డేట్ ఇస్తానని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా హామీ ఇచ్చాడు. కానీ అది కూడా జరగలేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్ నెగెటివ్ ట్రెండ్ ను ప్రారంభించారు.

- Advertisement -

థమన్ చల్లబరిచే ప్రయత్నం..

అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇలా నెగిటివ్ ట్రెండ్ చేయడం పట్ల “గేమ్ ఛేంజర్” మ్యూజిక్ డైరెక్టర్ “థమన్” (Thaman) రెస్పాండ్ అయ్యాడు. సోషల్ మీడియాలో థమన్ ట్వీట్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు.. నెగెటివ్ ట్రెండ్స్ & అసభ్యకరమైన వ్యాఖ్యలను వ్యాప్తి చేయడం వల్ల ఉపయోగం ఏమిటి. ఇది సినిమాను, దాని గొప్పతనాన్ని దెబ్బతీస్తుంది. మా టెక్నికల్ టీమ్ అంతా గత 2 సంవత్సరాల నుండి కంటెంట్‌ను అద్భుతంగా రెడీ చేస్తున్నారు. దాన్ని మీ అందరికోసం బెస్ట్ అవుట్ ఫుట్ తో తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. అభిమానులందరూ దయతో మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.. ఇక నెగెటివ్ ట్రెండ్ చేయడం లాంటివి సినిమా ప్రతిష్టను దెబ్బతీస్తాయని థమన్ పేర్కొన్నాడు. అయితే ఈ నెలలో తప్పకుండా అప్డేట్ వస్తుందని చరణ్ అభిమానులకు హామీ ఇచ్చాడు థమన్. మరి వినాయకచవితికి ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇస్తారా లేక మరో పండక్కి వాయిదా వేస్తారా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు