GameChanger : థమన్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది.. చరణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ..

GameChanger : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ దాదాపు ముగిసిపోయిందన్న విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్ గాని, దిల్ రాజు గాని రామ్ చరణ్ కి సంబంధించిన షూట్ మొత్తం ఫినిష్ అయిందని, మిగతా చిన్న చిన్న సీన్లకు సంబంధించి ఓ పది రోజులు మాత్రమే షూటింగ్ బాకీ ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాని దిల్ రాజు మాత్రం క్రిస్మస్ కి తీసుకువస్తున్నాం అని అన్నాక మళ్ళీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు. దీంతో మెగాభిమానులకు మళ్ళీ డౌట్లు స్టార్ట్ అయ్యాయి. అసలు క్రిస్మస్ కైనా తీసుకువస్తారా లేదా అన్న అనుమానాల్లో అభిమానులున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ కి సంబంధించి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది.

Thaman said crazy update from GameChanger

గేమ్ ఛేంజర్ పై థమన్ అప్డేట్…

అయితే గేమ్ ఛేంజర్ (GameChanger) గురించి ఒక్క అప్డేట్ కోసం చరణ్ (Ram Charan) అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఐదు నెలల కింద ఓ లీక్ అయిన పాట తప్ప మరే అప్డేట్ కూడా రాలేదు. పైగా గేమ్ ఛేంజర్ షూటింగ్ కూడా అయిపోయిందని అందరూ అంటున్నా, ప్రమోషన్లు అయితే స్టార్ట్ చేయలేదు. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గేమ్ ఛేంజర్ పై హింట్ ఇచ్చాడు.

- Advertisement -

అతి త్వరలోనే వచ్చేస్తున్నాం..

ఇక తాజాగా దర్శకుడు శంకర్ షణ్ముగం (Shankar Shanmugam) పుట్టినరోజు సందర్భంగా, ఆయనతో తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ను గుర్తుచేస్తూ థమన్ బర్త్ డే విషెస్ చెప్తూ పోస్ట్ చేసాడు. ఆ పోస్ట్ లో శంకర్ కి బర్త్ డే విష్ చెప్తూ… అలాగే తామిద్దరం కలిసి బాక్సాఫీస్ దగ్గర బ్యాంగర్ హిట్ కొట్టబోతున్నాం అంటూ… ఇక అతి త్వరలోనే గేమ్ ఛేంజర్ నెక్స్ట్ అప్డేట్ రాబోతుంది అని థమన్ కన్ఫర్మ్ చేసాడు. దీన్ని బట్టి గేమ్ ఛేంజర్ నెక్స్ట్ అప్డేట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక రాబోయే అప్డేట్ రెండో సాంగ్ గాని, లేదా గేమ్ ఛేంజర్ టీజర్ గాని ఉండొచ్చని సమాచారం. ఇక గేమ్ ఛేంజర్ నెక్స్ట్ అప్డేట్ ఏమొస్తుందో అని చరణ్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు