OG : “ఓజి” పై థమన్ క్రేజీ కామెంట్స్… లైఫ్ టైం ఉండిపోతుంది!

OG : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “ఓజి” సినిమా కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మొదలైనప్పటినుండే ఓ రేంజ్ లో ఉంటుందని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా, దీని కంటే మిగతా రెండు సినిమాలు ముందే షూటింగ్ స్టార్ట్ చేసినా, OG కోసమే పీకే ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యాంగా పవన్ ఈ సినిమాలు ఆపి రాజకీయాల్లో బిజీగా ఉండడం చేత అన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం, ఏకంగా డిప్యూటీ సీఎం కూడా కావడం జరిగింది. ఇక ఆహ్వానం కళ్యాణ్ రాక కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే దానికి ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పేలా లేదు. ఇదిలా ఉండగా ఓజి పై మేకర్స్ మాత్రం షూటింగ్ చేయకున్నా, ఎదో ఒక అప్డేట్ ఇస్తూ ఉన్నారు. తాజాగా ఓజి పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా అవి నెట్టింట వైరల్ గా మారాయి.

Thaman's interesting comments on Pawan Kalyan's movie "OG"

లైఫ్ టైం గుర్తుండిపోతుంది!

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా ముంబై కి చెందిన ఒక గ్యాంగ్ స్టర్ కి సంబంధించిన కథగా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి కాగా, పవన్ కళ్యాణ్ వచ్చేదాకా మొదలయ్యేలా లేదు. ఇక మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఓజి కి సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రం పై మరోసారి థమన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ పై ఒక అభిమాని చేసిన ఎడిట్ వీడియోకు ట్విట్టర్ లో థమన్ రియాక్ట్ అయ్యాడు. దానిపై థమన్ రిప్లయ్ ఇస్తూ… బ్రదర్ మా దగ్గర దీనికంటే చాలా క్రేజీ ఉంది. అది “లైఫ్ టైమ్ ఉండిపోతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే “ఓజి” కోసం ఎదురు చూడండి అని అన్నారు. ఇప్పుడు థమన్ చేసిన ఈ పోస్ట్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక థమన్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలకు అదిరిపోయే మాస్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ఓజి కి వీటిని మించి ఏ రేంజ్ లో ఇస్తాడో అని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు.

- Advertisement -

https://x.com/MusicThaman/status/1806031992867455143

ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా?

ఇక దాదాపు ఏడాది కాలంగా ఓజి సినిమా కోసం పీకే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలని విపరీతంగా పెంచేసింది. ఇక ఆ మధ్య సుజిత్, పవన్ కల్యాణ్ ఈ చిత్రానికి ప్రత్యేకంగా ‘క్రవ్ మగా’ అనే మార్షల్ ఆర్ట్ శిక్షణ తీసుకున్నారని, సినిమాకి అవసరమైన ప్రత్యేక సన్నివేశాలను షూట్ చేసేందుకు ఎంతగానో శ్రమించారని చెప్పుకొచ్చాడు. కానీ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నది ఒకటే.. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో అని. రాజకీయాలకి సంబంధించి అన్ని పనులు పూర్తయినా ఎప్పుడు వస్తారో చెప్పలేని పరిస్థితి. ఇక సెప్టెంబర్ 27 నుండి ఆల్రెడీ తప్పుకోగా, ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఓజి లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, వెంకట్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు