Thandel: తండేల్ అసలు ఓనర్ ఎవరు.. రియలా లేక కల్పితమా .?

Thandel.. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ సినిమా చేసి ఘోర పరాభవాన్ని చవిచూసిన నాగచైతన్య.. ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక అందులో భాగంగానే తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఇందులో మరోసారి నాగచైతన్యతో జత కట్టడానికి సిద్ధమయ్యింది సాయి పల్లవి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్ అనగానే కచ్చితంగా మళ్ళీ హిట్ అవుతుందని అభిమానులు అనుకున్నారు.. అయితే ఇక్కడ ఈ సినిమా కథ తెలిస్తే మాత్రం నటీనటులతో సంబంధం లేకుండా కథ సినిమాకు ప్రాణం పోస్తోంది అని చెప్పవచ్చు..

తండేల్.. ఇట్స్ రియల్ స్టోరీ..

Thandel: Who is the original owner of Thandel.. Is it real or fictitious?
Thandel: Who is the original owner of Thandel.. Is it real or fictitious?

ముఖ్యంగా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నాగచైతన్యకు చందు మొండేటి ఈ సినిమాలో అవకాశం కల్పించారు.. కచ్చితంగా రూ.100 కోట్ల క్లబ్లో నాగచైతన్య ఎంటర్ అవుతాడని.. అప్పుడే అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలలో కూడా టాక్ గట్టిగా వినిపిస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమా చాలావరకు రికవరీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 70 శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగు శ్రీకాకుళంలో నిర్వహించే షెడ్యూల్ తో ముగుస్తుందని సమాచారం.. ముఖ్యంగా శ్రీకాకుళం నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందట.. గీత ఆర్ట్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథ ఇప్పటివరకు డైరెక్టర్ చందు మొండేటిదే అని అందరూ అనుకున్నారు.. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు..

అసలు ఓనర్ ఆయనే..

ఇది రియలా? లేక కల్పితమా? అంటే.. ఇది రియల్ స్టోరీ అని తెలుస్తోంది.. 2018 లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ను తీసుకొని రైటర్ కార్తీక్ తీడా ఈ కథను డిజైన్ చేశారట. ఈ కథ కోసం అక్కడి చేపలు పెట్టే వాళ్ళతో మూడు నెలలు ఉండి.. వాళ్ళ జీవనశైలిని.. ఆహార పలవాట్లను తెలుసుకున్నారట. సముద్రంలో వేటకు వెళ్లే టైంలో కూడా ఇతను వారి వెంటే ఉండి.. వాళ్ళు ఎదుర్కొనే సవాళ్లను దగ్గరుండి మరీ గమనించారట. అలాగే తండేల్ రాజు, బుజ్జి ల ప్రేమ కథని కూడా బాగా రాశారట. మొత్తం పూర్తయ్యాక ఇతను గీత ఆర్ట్స్ కి వినిపించగా.. వారు వెంటనే ఓకే చేశారు.. కార్తిక్ తీడా.. స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఇక అలా ఈ సినిమా కథకి అసలు ఓనర్ కార్తీక్ తీడా అని చెప్పవచ్చు..

- Advertisement -

చివరికి చందు మొండేటి వద్దకు..

ఇక ఇది కల్పితం కాదు రియల్ స్టోరీ అని.. అక్కడి పరిస్థితులను దగ్గరుండి గమనించి మరీ కథను రాసినట్లు తెలుస్తోంది.. ఎంతో కష్టపడి రాసుకున్న ఈ కథ…చివరికి చందు మొండేటి దగ్గరకు చేరింది. మరి ఈయన తెరకెక్కించే విధానం..? ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే తీరు ఎలా ఉంటుందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేవరకు చూడాల్సిందే.. ఇక ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు