Thangalaan Censor : సెన్సార్ పూర్తి చేసుకున్న తంగలాన్… సినిమా వాళ్లకు మాత్రమే

Thangalaan Censor : చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ తంగలాన్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మరి ఈ సినిమా రన్ టైమ్ ఎంత? సెన్సార్ టీం ఏ సర్టిఫికెట్ జారీ చేసిందో తెలుసుకుందాం పదండి.

సెన్సార్ రిపోర్ట్

కర్ణాటకలోని గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తంగలాన్ మూవీని డైరెక్టర్ రంజిత్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈ డైరెక్టర్ కబాలి, కాలా, సార్పట్టా చిత్రాలకు దర్శకత్వం వహించారు. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై కే ఈ జ్ఞానవేల్ రాజా ఈ మూవీని నిర్మిస్తుండగా, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ హీరోగా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తంగలాన్ ను ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు మేకర్స్. ఆగస్ట్ 15న తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

అయితే ఇప్పటిదాకా ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 43 నిమిషాలు ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం తంగలాన్ రన్‌టైమ్ దాదాపు 2 గంటల 35 నిమిషాలు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, సెన్సార్ బోర్డ్ నుండి యు/ఎ సర్టిఫికేట్ పొందింది. అంటే అన్ని వయసుల వారు ఈ సినిమాను నిరభ్యంతరంగా చూడవచ్చు. ఆగస్ట్ 15న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది అంటూ స్టూడియో గ్రీన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి అనే విషయాన్ని వెల్లడించింది. కాగా ఏప్రిల్‌ లో విడుదల కావలసి ఉన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు త్వరలోనే రిలీజ్ కానుంది.

- Advertisement -

Image

భారీ ధరకు ఓటీటీ రైట్స్

హిస్టారికల్ యాక్షన్ మూవీగా రాబోతున్న తంగలాన్ సినిమాను మదురై, చెన్నై, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక సహా వివిధ లొకేషన్లలో చిత్రీకరించారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేసి మంచి హైప్ ను క్రియేట్ చేశారు. ఇంతకుముందు ఈ చిత్ర నిర్మాతలు మినిక్కి మినీకి అనే మొదటి సింగిల్‌ను విడుదల చేశారు. ఉమాదేవి రచించిన ఈ పాటను సిందూరి విశాల్ పాడారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో సహా పలు భాషల్లో విడుదల కాగా, మంచి రెస్పాన్స్ దక్కింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ భారీ ధరకు జరిగిందని సమాచారం. దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. మరోవైపు విక్రమ్ కెరీర్ లోనే ఇది మరిచిపోలేని మూవీ అవుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు