Thangalaan : బొమ్మ సెంచరీ కొట్టిందంటూ ఫేక్ పోస్టర్లు.. మరీ ఇంత తేడానా?

Thangalaan : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటించిన తంగలాన్ సినిమా ఆగష్టు 15న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ హారర్ యాక్షన్ ఫాంటసీ డ్రామా థియేటర్లలో డీసెంట్ టాక్ తెచ్చుకుంది. నిజానికి సినిమాకి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాకపోతే విక్రమ్ పెర్ఫార్మన్స్, పా రంజిత్ (Pa Ranjith) దర్శకత్వ ప్రతిభ చాలా బాగుందని చెప్పాలి. ఇక ఈ సినిమా పంద్రాగస్టుకు రిలీజ్ కాగా, అప్పుడు రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ కన్నా తంగలాన్ బెటర్ టాక్ తెచ్చుకున్నా, మిగతా చిత్రాల పోటీ వల్ల డీసెంట్ స్టార్ట్ ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలు వీకెండ్ కే చాప చుట్టేయగా, తంగలాన్ (Thangalaan) లిమిటెడ్ స్క్రీన్స్ లో రన్ అవుతూ వచ్చింది. కానీ ఓవరాల్ గా ఈ సినిమా వసూళ్లు ఎండ్ అయిపోగా, తాజాగా మేకర్స్ కలెక్షన్ల పోస్టర్లు రిలీజ్ చేసారు.

Thangalaan movie 100crore poster released

 

- Advertisement -

తంగలాన్ సెంచరీ కొట్టిందని పోస్టర్..

అయితే తంగలాన్ సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ రాగా, లాంగ్ రన్ లో ఆడుతుందని అనుకున్నారు. కానీ సినిమాకి ఆశించిన విధంగా జనాలు థియేటర్లు రాలేదు. ఒక వర్గం ప్రేక్షకులని మెప్పించేలానే సినిమా ఉందని టాక్ వచ్చింది. అయితే వీకెండ్ తర్వాత హోల్డ్ చూపిస్తుంది అని అందరూ అనుకున్నా జరగలేదు. ఇక తాజాగా తంగలాన్ కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయగా, ఊహించని విధంగా 100 కోట్లు దాటిందని పోస్టర్ రిలీజ్ చేసారు. అయితే నిజానికి తంగలాన్ సినిమా వసూళ్ల పరంగా ఇప్పటివరకు 70 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది.

మరీ ఇంత ఫేక్ ఎందుకు?

నిజానికి తంగలాన్ 70 కోట్ల వసూళ్లు మాత్రమే అందుకోగా, మేకర్స్ మాత్రం వంద కోట్లు కొట్టిందని పోస్టర్లు వేశారు. పైగా 65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా 37 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 28 కోట్లయినా కావాలి. గ్రాస్ పరంగా 70 కోట్లు రాగా, 130 కోట్ల రేంజ్ లో రావాలి. కానీ మేకర్స్ మరో 30 కోట్లు తగిలించి వంద కోట్ల పోస్టర్ వేసేసారు. దీనిపై నెట్టింట తెగ చర్చ నడుస్తుంది. విక్రమ్ లాంటి స్టార్ సినిమాకి ఇలాంటి పోస్టర్లు మేకర్స్ ఎందుకు వేస్తున్నారు అని ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఇక తంగలాన్ థియేట్రికల్ రన్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చేయగా, వచ్చేవారం విజయ్ గోట్ వస్తుండడంతో థియేటర్లలోంచి పూర్తిగా తీసేసే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు