Thangalaan: తంగలాన్ సినిమాపై ప్రొడ్యూసర్ రెస్పాన్స్

Thangalaan: తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ లో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో పా రంజిత్ ఒకరు. రజనీకాంత్ నటించిన కబాలి సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు రంజిత్. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా ఆ తర్వాత కాలా సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించుకుంది. ఇక రంజిత్ పా సినిమాలకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. కొంతమంది వెట్రి మారన్ తర్వాత అంతటి టాలెంట్ ఉన్న దర్శకుడు పా రంజిత్ అని అంటూ ఉంటారు. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా చాలామంది అభిమానులు రంజిత్ కు ఉన్నారు.

ఇక చాలామంది నటులకు కూడా తెలుగులో మంచి గుర్తింపు ఉంది. అలా తెలుగులో మంచి గుర్తింపు సాధించుకున్న తమిళ్ హీరోస్ లో విక్రమ్ కూడా ఒకరు. విక్రమ్ చేసిన ఎన్నో సినిమాలు ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ చేసిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విక్రం తోపాటు శంకర్ కూడా మంచి పేరును తీసుకొచ్చింది. విక్రమ్ చేసే ప్రతి సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతూ వస్తుంది.

Chiyaan Vikram  Thangalaan

- Advertisement -

ఇక ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో విక్రం తంగలాన్ అనే సినిమాను చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా కొంచెం లేటుగా రిలీజ్ కావలసి ఉంది. కానీ పుష్ప సినిమా పోస్ట్ పోన్ అవడం వలన ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ వలన తను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెబుతూ వచ్చాడు. ఈ సినిమాని చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లేకపోతే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా కంప్లీట్ గా ఈ సినిమా కోసం విక్రమ్ పనిచేశారు అని జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు