Thangalaan : టాలీవుడ్ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు… కాస్త చూసుకోండి హీరో గారు

Thangalaan : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మోస్ట్ అవైటెడ్ సౌత్ మూవీ. అయితే మేకర్స్ ఈ మూవీ రిలీజ్ విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయాన్ని తంగలాన్ సినిమాతో బ్రేక్ చేయబోతున్నారు.

తెలుగు సినిమాలకు పోటీగా..

తంగలాన్‌లో విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ 2024 ఆగస్ట్ 15న థియేట్రికల్ రిలీజ్ లాక్ కావడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ డైరెక్ట్ గా తెలుగు రాష్ట్రాలలో తెలుగు సినిమాలైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌తో సహా అదే రోజు రిలీజ్ కానున్న ఇతర చిత్రాలతో బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఊరికే తెలుగులో రిలీజ్ అయితే పరవాలేదు. కానీ ఏకంగా ఎప్పటి నుంచో టాలీవుడ్ ఫాలో అవుతున్న రూల్స్ ను తంగలాన్ అనే ఈ తమిళ సినిమాతో బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు విక్రమ్.

Vikram-starrer Thangalaan release date postponed, film's team shares update  - Hindustan Times

- Advertisement -

ఇప్పటిదాకా తమిళ భాషా చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకు డైరెక్ట్ పోటిగా రిలీజ్ కాకుండా చూసుకుంటున్నారు టాలీవుడ్ మేకర్స్. ఇప్పటిదాకా తెలుగు భాషలోకి డబ్ అయిన అనేక తమిళ చిత్రాలు కూడా ఇలా డైరెక్ట్ రిలీజ్ కు నోచుకోలేదు. తెలుగు భాషా సినిమా కాదన్న ఒకే ఒక్క రీజన్ తో పలు తమిళ డబ్బింగ్ సినిమాలు వాయిదా పడ్డాయి. దీనివల్ల తెలుగు సినిమాలకు సోలో రిలీజ్ కు ఛాన్స్ ఉంటుందన్న మాట. అయితే ఆగష్టులో రాబోయే చిత్రం తంగలాన్ ఈ రూల్ ను బ్రేక్ చేసి, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేయడం ద్వారా కొత్త మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి తెలుగు చిత్ర సీమ ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఆ రెండు సినిమాలకూ ఇబ్బందే

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి తెలుగు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో థియేటర్‌ల కోసం ఈ రెండు సినిమాల మధ్య భారీగా పోటీ నెలకొంది. పైగా రవితేజ, రామ్ ఇద్దరికీ కూడా ఈ సినిమాలు ముఖ్యమే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరోల్లో ఇండిపెండెన్స్ డే విన్నర్ గా నిలిచేది ఎవరు అన్న ఉత్కంఠత నెలకొంది. ఇలాటి తరుణంలో తంగలాన్ కూడా అదే రోజు థియేటర్లలోకి రానుండడం ఇద్దరు హీరోలకూ ఇబ్బందిని కలిగించే విషయమే. నిర్మాతలు కూడా డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తంగలాన్ తెలుగు సినిమాలతో సమానంగా ఆడుతుందని స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. మరోవైపు విక్రమ్ కు కూడా ఈ మూవీ హిట్ కావడం ఇంపార్టెంట్. మరి ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీసు పోరుకు రెడీ అయితే అందులో ప్రేక్షకుల ఆదరణ ఏ సినిమాకు దక్కుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు