Thankyou: మహేష్ ఫ్యాన్స్ కి ఎర

జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన కెరియర్ లో సాలిడ్ హిట్స్ అందుకున్నాడు నాగచైతన్య. ఈ మధ్యకాలంలో వచ్చిన నాగ చైతన్య సినిమాలు అన్ని మంచి ఫలితాన్ని తీసుకుని వచ్చాయి. చై ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ” సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. బివీఎస్ రవి థాంక్యూ చిత్రానికి కథను అందించారు.

వరుస హిట్ సినిమాలతో జోరుమీదున్న నాగచైతన్య తాజా చిత్రానికి మాత్రం బజ్ లేదు. జులై 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న థాంక్యూ చిత్రం ప్రొమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.
స్వయంగా రచయిత బీవీఎస్ రవి కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు.

ఏదిఏమైనా థాంక్యూ చిత్రం మహేష్ బాబు అభిమానులను దగ్గర చేసుకుంటుంది. థాంక్యూ చిత్రంలో చై, మహేష్ అభిమానిగా కనిపించనున్నాడు. మహేష్ కెరియర్ లో వచ్చిన మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఒక్కడు, పోకిరి, దూకుడు సినిమాల రిఫరెన్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయట. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా బీవీఎస్ రవి తెలియజేసారు. మహేష్ అభిమానులకు ఇది ఆనందం కలిగించే విషయం. థాంక్యూ సినిమాకి పెద్దగా ప్రొమోషన్స్ జరగపోయినా, ఈ ఒక్క అంశంతో మహేష్ అభిమానులు థాంక్యూ సినిమాను ప్రోమోట్ చేస్తారు అనే ఉద్దేశ్యంతో బివీఎస్ రవి ఈ అప్డేట్ ఇచ్చారనేది కొంతమంది అభిప్రాయం.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు