Tharun Bhascker : డైరెక్షన్ ఎప్పుడో చెప్పలేము, మళ్లీ నటుడుగా మన ముందుకు

Tharun Bhascker : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో తరుణ్ భాస్కర్ ఒకరు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి అప్పట్లోనే మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పెళ్లిచూపులు అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాను కూడా చేశాడు తరుణ్. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. ఇక తర్వాత తరుణ్ భాస్కర్ కొన్ని కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించాడు.

విజయ్ దేవరకొండ నిర్మాతగా మీకు మాత్రమే చెబుతా అనే ఒక సినిమా ను నిర్మించాడు. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు. ఈ సినిమా తర్వాత నటుడుగా తరుణ్ భాస్కర్ ఎక్కువ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఒక టైం లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అని చాలామంది తరుణ్ సినిమాల కోసం వేచి చూసిన ఆడియన్స్ కూడా ఉన్నారు. మొత్తానికి మరోసారి ప్రేక్షకుల ముందుకు కీడాకోలా అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ సాధించుకుంది. ఈ సినిమాలో నాయుడు అనే పాత్రలో కనిపించాడు తరుణ్.

Tharun

- Advertisement -

ఇకపోతే తరుణ్ భాస్కర్ మెయిన్ లీడ్ మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యారో సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు భుసం జగన్మోహన్ రెడ్డి, దర్శకుడు వేణు అడుగుల నిర్మాతలకు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను వంశి రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ కూడా అనౌన్స్ చేశారు. ఈ కాస్టింగ్ కాల్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఒక ప్రామిసరీ నోటు మీద నటులు కావలెను అని డిజైన్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరగనున్నట్లు తెలుస్తోంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు