Kalki producers: కల్కి సినిమా తీయడం వెనుక మా ఉద్దేశం అది కాదు, మీరు అలా అంటుంటే నవ్వొస్తుంది

Kalki producers: నిన్నటి వరకు ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూసిన సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించారు. ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటించింది. ఇండియన్ సినిమా చరిత్రలో మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం ఈ సినిమా సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలు ఏ స్థాయిలో ఆడుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకి అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

వైజయంతి బ్యానర్ లో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కాయి. అందులో శక్తి సినిమా కూడా ఒకటి. అయితే ఒక ప్రముఖ జ్యోతిష్యుడు శక్తి సినిమా తీయకండి అని చెప్పినా కూడా వినకుండా అశ్విని దత్ ఆ సినిమాను నిర్మించారు. ఆ సినిమా భారీ నష్టాలను తీసుకువచ్చింది. ఆల్మోస్ట్ వైజయంతి బ్యానర్ పని అయిపోయింది అనుకున్న టైంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు వైజయంతి బ్యానర్ కి అనుసంధానంగా స్వప్న సినిమాస్ అనే బ్యానర్ కూడా క్రియేట్ చేశారు. ఈ బ్యానర్ లో స్వప్న, ప్రియాంక సినిమాలు నిర్మిస్తూ ఉంటారు.

Swapna Dutt about Prabhas Kalki

- Advertisement -

కల్కి సినిమాలో కూడా స్వప్న ప్రియాంక భాగమయ్యారు.ఇకపోతే ఈ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. అయితే ఈ సినిమా నిర్మాతలకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ మనం రికార్డ్స్ క్రాస్ చేశామా అని అడుగుతున్నారట. దానికి సమాధానంగా ఈ నిర్మాతలలో ఒకరైన స్వప్న దత్ ట్విట్టర్ వేదిక ఆన్సర్ చేశారు. రికార్డ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా రికార్డ్స్ కోసం సినిమా తీయని చెప్తూ సినిమా కేవలం ప్రేక్షకుల కోసమే తీస్తాము సినిమా పైన తమకున్న ప్రేమ అలాంటిది అని చెబుతూ మేము కూడా సినిమా పైన ప్రేమతోనే కేవలం సినిమా ప్రేక్షకులు కోసం మాత్రమే తీశామంటూ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు