Alluarjun: ఆ నిర్మాత నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్..!!

Alluarjun:  టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు సుపరిచితమే.. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్లో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. పుష్ప సినిమాతో ఎక్కడలేని క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పటికీ సరికొత్త ట్రెండ్ మార్కుని సెట్ చేసుకున్నారు. టాలీవుడ్ , బాలీవుడ్ నిర్మాతలు కూడా ఎక్కువ పారితోషకాన్ని ఇచ్చేందుకు మక్కువ చూపుతున్నారు. ఇలాంటి అల్లు అర్జున్ ఇటీవల చేసిన ఒక సినిమాకి ప్రముఖ నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ ఒక పోస్ట్ ద్వారా తెలియజేశారు.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక నిర్మాత ఫోటో షేర్ చేస్తూ.. అతను తనకు రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ ఆ ఫోటో కింద రాసుకొచ్చారు. అయితే ఇంతకీ ఆ నిర్మాత ఎవరో కాదు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్.. అల్లు అర్జున్ మొదటి సినిమా ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా గంగోత్రి సినిమా అని చెబుతారు.. అయితే ఈ సినిమా కంటే ముందు అల్లు అర్జున్ వెండితెర పైన కనిపించారు. అది కూడా చిరంజీవి నటించిన డాడీ సినిమా అని గుర్తుకువస్తుంది.

డాడీ సినిమా కంటే ముందే అల్లు అర్జున్ మరొక సినిమాలో కూడా నటించడం జరిగింది. అది కూడా చిరంజీవి నటించిన సినిమా కావడమే గమనార్హం. చిరంజీవి హీరోగా 1985లో తెరకెక్కించిన విజేత సినిమా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక చైల్డ్ యాక్టర్ గా ఒక సన్నివేశంలో కనిపిస్తారు.. అది కూడా చిరంజీవి చెల్లెలు కొడుకుగా అల్లు అర్జున్ కనిపించారు.. అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి సినిమా కూడా ఇదే.. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు.

- Advertisement -

విజేత సినిమా 100 డేస్ షీల్డ్ ని అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలలో షేర్ చేస్తూ నా మొదటి చిత్రం విజేత.. నా ప్రొడ్యూసర్ మా నాన్న.. అయితే ఇన్నాళ్ల తర్వాత నేను గ్రహించినది ఏమిటంటే..ఈ చిత్రానికి తనకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ కూడా సరదాగా రాసుకొచ్చారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ తన స్టోరీలో పంచుకున్న ఈ ఫోటో వైరల్ అవుతుంది.. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ ..కమలహాసన్ నటించిన స్వాతిముత్యం చిత్రంలో కూడా చైల్డ్ యాక్టర్ గా నటించారు.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు