Karthik Subbaraj: అది నా గోల్ కాదు – కార్తీక్ సుబ్బరాజ్

Karthik Subbaraj: షార్ట్ ఫిలిమ్స్ తో కెరీయర్ మొదలుపెట్టి దర్శకులు అయిన వాళ్ళు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలానే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన చాలామంది దర్శకులు ఉన్నారు. అదే దర్శకులు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేశారు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కించి ఆ తర్వాత పిజ్జా అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్ సుబ్బరాజ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా పిజ్జా పేరుతో విడుదలైంది. విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్.

జిగర్తాండ తోనే మంచి గుర్తింపు

పిజ్జా సినిమాతో దర్శకుడుగా మంచి గుర్తింపు సాధించుకున్న తర్వాత జిగర్తాండ అనే సినిమాను చేశాడు కార్తీక్. సిద్ధార్థ నారాయణ్ బాబీసింహ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఒక గ్యాంగ్ స్టార్ కి సినిమా డైరెక్టర్ కి మధ్య జరిగే ఈ కథ చాలామందిని ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించడమే కాకుండా అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇదే సినిమాను గద్దల కొండ గణేష్ అనే పేరుతో హరీష్ శంకర్ తెలుగులో రీమేక్ చేశాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా కనిపించాడు. వరుణ్ తేజ్ కెరియర్ లో బెస్ట్ ఫిలిం ఏదో ఒకటి అని చెప్పొచ్చు.

రజనీకాంత్ తో సూపర్ హిట్

ఆ సినిమాలు తర్వాత కొన్ని సినిమాలు చేసిన కార్తీక్ పేట సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ అద్భుతమైన హిట్ సినిమాను అందుకున్నాడు. రజనీకాంత్ అభిమానులు రజినీకాంత్ ను ఎలా చూడాలనుకుంటున్నారు అలా చూపించి ఒక విజువల్ ట్రీట్ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత జగమే తంత్రం అనే సినిమాని చేశాడు. ఆ తర్వాత చియాన్ విక్రమ్, దృవ్ తో మహాన్ అనే సినిమాను చేశాడు ఈ సినిమా డైరెక్టర్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.

- Advertisement -

Karthik Subbaraj

వాళ్లతో సినిమా చేయడం పెద్ద డీల్ కాదు

ఇకపోతే రీసెంట్ గా కార్తీక్ సుబ్బరాజు ఒక స్టేట్మెంట్ను ఇచ్చాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేయటం దర్శకుడుగా తన గోల్ కాదని చెప్పుకొచ్చాడు. తలపతి విజయ్ అజిత్ కుమార్ లాంటి హీరోలతో సినిమాలు చేయటం అనేది పెద్ద మేటర్ కాదని. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఏ బిగ్ డీల్ అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్. ఇకపోతే చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఆశపడుతుంటారు కానీ ఒక ఫిలిం మేకర్ గా తనకి నచ్చే సినిమా తీసే ప్రయత్నం చేస్తుంటాడు కార్తీక్. ఇకపోతే కార్తీక్ ప్రస్తుతం సూర్యతో సూర్య 44వ సినిమాను చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు