Jani Master: అందుకే నేను ఇండియన్ 2 సినిమాకి వర్క్ చేయలేదు- జానీ మాస్టర్

Jani Master: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొరియోగ్రాఫర్స్ లో జానీ మాస్టర్ ఒకరు. నితిన్ నటించిన సినిమాకి కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ మంచి పేరును సాధించుకొని, ఆ తర్వాత ఢీ అనే షోకి ఎంట్రీ ఇచ్చాడు. ఢీ షోలో జానీ మాస్టర్ మంచి పేరును సాధించుకున్నాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అనిపించింది చెప్పడం వలన జానీ మాస్టర్ కి కొంతమంది సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఢీ షోలో నుండి జానీ మాస్టర్ వెళ్ళిపోయినా కూడా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు అయితే జానీ మాస్టర్ ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా మారి రామ్ చరణ్ తేజ్ తో సినిమాలుకు పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు.

రామ్ చరణ్ తేజ్ గురించి పలు సందర్భాల్లో జానీ మాస్టర్ చెబుతూ వచ్చాడు. ఈరోజు జానీ మాస్టర్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం రామ్ చరణ్ అని స్వయంగా ఆయన మాటల్లో చాలాసార్లు చెప్పాడు. రామ్ చరణ్ నటించిన ఎవడు రచ్చ నాయక్ వంటి ఎన్నో సినిమాల్లో మంచి కొరియోగ్రఫీ చేశాడు జానీ. ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు టు సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో జానీ మాస్టర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వాస్తవానికి జానీ మాస్టర్ భారతీయుడు 2 సినిమాకి పనిచేయలేదు. కానీ ఈ ఇంటర్వ్యూలో హాజరై అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

రామ్ చరణ్ తేజ్ శంకర్ కలిసి గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరియర్ లో 15వ సినిమాగా ఆ సినిమా వస్తోంది. ఆ సినిమాలో కొన్ని పాటలకు కొరియోగ్రఫీ చేశాడు జానీ మాస్టర్. అక్కడితో దర్శకుడు శంకర్ కి జానీకి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అయితే ఇండియన్ 2 సినిమా విషయానికి వస్తే జానీ మాస్టర్ కు శంకర్ పరిచయమైన టైంకి ఇండియన్ టు పాటలు పూర్తయిపోయాయి. అందుకోసమే ఆ సినిమాకి జానీ మాస్టర్ పనిచేయలేకపోయాను అంటూ చెబుతూ వచ్చాడు.

- Advertisement -

INDIAN 2

ఇక శంకర్ సార్ తో పని చేయడం చాలా ఈజీ. ఒక పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఆయన కూడా చాలా ఐడియాలతో ముందుకు వస్తారు. ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా ఈ పాటను చేద్దాం ఎక్కడా రాణి విధంగా ఈ పాటను చూపిద్దాం అనే ఆలోచనతో ఆయన ఉంటారు అంటూ జాని చెప్పుకొచ్చాడు. ఇక ఇండియన్ 2 సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో జానీ కూడా తనవంతుగా ఇంటర్వ్యూలో పాల్గొని ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు