Hero Darshan : జైలుకు వెళ్లి హీరో దర్శన్ ను కలిసి చిక్కుల్లో పడ్డ నటుడు..?

Hero Darshan : తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ హీరో దర్శన్ (Darsan ), పవిత్ర ( Pavitra ) ల అరెస్ట్.. దీనిపై ఇప్పటికి విచారణ కొనసాగుతుంది. రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ ను తమ అభిమానులు కలిసి మాట్లాడుతున్నారు. ఆయన పై అభిమానం తో చాలా మంది డైరెక్ట్ గా జైలుకే వెళ్లి మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఏంతో మంది సినీ ప్రముఖులు ఆయనను కలిశారు. తాజాగా ఆయనను కలిసేందుకు ప్రముఖ కన్నడ నటుడు, హాస్యనటుడు చిక్కన్న ( Chikkanna) జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పై ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి..

రేణుకాస్వామి ( Renuka Swamy ) హత్యకు ముందు జూన్ 8న దర్శన్‌తో పాటు కేసులో నిందితులు ఆర్‌ఆర్‌నగర్‌లోని స్టోనీ బ్రూక్ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో నటుడు చిక్కన్న కూడా పాల్గొనడంతో పోలీసులు అతడిని ముందుగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అలాగే చిక్కన్న వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట సీఆర్‌పీసీ 164 కింద నమోదు చేశారు. నటుడు దర్శన్ సహా ఇతర నిందితులపై చిక్కన్న వాంగ్మూలాన్ని ముఖ్యమైన సాక్షిగా పరిగణించాలని పోలీసులు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం దాఖలు చేశారు.

The actor who went to jail and got into trouble with hero Darshan..?
The actor who went to jail and got into trouble with hero Darshan..?

మాములుగా కేసు విచారణలో ఉన్నప్పుడు సాక్షి గా ఉన్నవాళ్లు ఖైదీలను కలవకూడదు. ఈ కేసు విచారణలో ఉన్నప్పుడే జైలుకు వెళ్లి చిక్కన్న దర్శన్ ను కలవడం పై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిందితుడితో ఆయన ఏం మాట్లాడాడు? అనే విషయంపై పోలీసులు చిక్కన్నను ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు సాక్షి, నిందితుల మధ్య జరిగిన భేటీకి సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులు జైలు అధికారుల నుంచి రాబట్టనున్నారు. అలాగే ఈ కేసులోని సాక్షులు దర్శన్‌ను కలవకుండా అడ్డుకోవాలని సిట్‌ కోర్టును ఆశ్రయించింది.. దీన్ని బట్టి చూస్తే చిక్కన్న చిక్కుల్లో పడ్డట్లే అని తెలుస్తుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు