Baby Movie: ఎన్ని ఆఫర్స్ వచ్చినా… మళ్ళీ బేబీ కాంబినేషనే రిపీట్

ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే ఎస్కేఎన్ ను జూనియర్ బండ్ల గణేష్ అని అంటారు. ఇది వరకే రిపోర్టర్ గా అనుభవం ఉండటం వలన ఏదైనా స్టేజ్ పైన మైక్ పట్టుకుంటే డైలాగులు వర్షం కురిపిస్తాడు. తను టార్గెట్ చేసిన సెలబ్రిటీల్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ రాయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు కలెక్షన్లు కొల్లగొట్టి నిర్మాత వరకు ఎదిగాడు ఎస్ కే ఎన్.

ఎస్ కే ఎన్ చాలా సినిమాలు నిర్మించిన కూడా తన కెరియర్లో బెస్ట్ అంటే బేబీ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాకి ముందు కొంతమంది నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాకి కాలేజీ ఆడియన్స్ తో పాటు కుర్రకారు కూడా బ్రహ్మరథం పట్టారు. ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి మంచి కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా విషయంలో కొన్ని వివాదాలు… విమర్శలు వచ్చినా కూడా వాటన్నిటినీ అధిగమించి మంచి కలెక్షన్లు రాబట్టింది.

కలర్ ఫోటో, హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి సినిమాలతో సుపరిచితమైన సాయి రాజేష్ కి ఈ సినిమా ఒక గౌరవాన్ని తెచ్చి పెట్టింది. వాస్తవానికి ఒక సీరియస్ ఫిలిం మేకర్ గా సాయి రాజేష్ పని చేసిన సినిమా అంటే బేబీ అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత సాయి రాజేష్ కి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ మళ్ళీ సాయి రాజేష్, ఎస్కేఎన్ కాంబినేషన్ లోనే మరో సినిమా రాబోతుంది. బేబీ తో దాదాపుగా 100 కోట్లకు దగ్గర చేరుకున్న వీరి కాంబినేషన్, వచ్చే సినిమాతో ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossips from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు