Mirai: “మిరాయ్” నుంచి మంత్రగాడు వచ్చేస్తున్నాడు

MIRAI: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది యంగ్ హీరోలు ఇండస్ట్రీని.. ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లను అండగా తీసుకొని… చిత్ర పరిశ్రమంలో అడుగు పెడుతూ ఉంటారు. మరి కొంతమంది హీరోలు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి ఆ తర్వాత హీరోలుగా మారుతారు. అలాంటి వారిలో తేజ సజ్జ ఒకరు. యంగ్ హీరో తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి… ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు తేజసజ్జ.

ఈ తరుణంలోనే వరుసగా హిట్స్ కొట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవల హనుమాన్ సినిమాతో ప్రభంజనం సృష్టించాడు ఈ యంగ్ హీరో. హనుమాన్ సినిమా… ఇప్పటికీ అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంది. ఎవరు ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది హనుమాన్ సినిమా.

అయితే ప్రస్తుతం తేజ మిరాయి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్షుద్ర పూజల నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్, దుల్కర్ లాంటి హీరోలు కూడా కనిపించనున్నారు. దుల్కర్ అయితే ఓ యోధుడి పాత్రలో పాత్రలో మెరువనున్నాడు. ఆటో మంచు మనోజ్.. మంత్రగాడి పాత్రలో కనిపించనున్నాడు.

- Advertisement -

అయితే తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రను రివిల్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు మంత్రగాడి పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇక మంచు మనోజ్…ఫుల్ పోస్టర్ను మే 20వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు కూడా తెలిపింది చిత్ర బృందం. దీంతో ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు