Guess The Actress : ఇటీవల కాలంలో సినీ సెలెబ్రేటీల చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. అందులో హీరోల ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త యాక్టర్స్ వస్తూనే ఉంటారు. అప్పటికే ఫామ్‌లో ఉన్న నటీనటులు సైలెంట్‌గా సైడ్ అయిపోతుంటారు. కొన్నిసార్లు మాత్రం హిట్ మూవీస్ చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎందుకో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు.. ఇక విషయానికొస్తే.. పైన కనిపిస్తున్న కుర్రాడు ఇప్పుడు తమిళ్లో స్టార్ హీరో.. ఇతనికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా?
ఆ ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడు ఒక స్టార్ హీరో.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు తెలిసిందా. అవును మీరు గెస్ చేసిందే కరెక్టే.. తమిళ దళపతి విజయ్ నే.. అతని చిన్నప్పటి ఫోటోనే ఇది.. వాళ్ల అమ్మతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తెలుగులో డబ్ అయిన సినిమాలు ఏ రేంజులో ఆకట్టుకున్నాయో మనం చూశాం..
ప్రస్తుతం విజయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఆయన చివరగా ది గోట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.. కొత్త పార్టీతో రాజకీయాల్లోకి రాబోతున్నాడు.. సినిమాల పరంగా అభిమానుల మనసు దోచుకున్న విజయ్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి జనాల మనసును ఎలా మెప్పిస్తాడో చూడాలి.. ఏది ఏమైన విజయ్ దళపతి రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.. ఇక ఇటీవలే తన తల్లి కోసం గుడిని కట్టించిన సంగతి తెలిసిందే. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..