Janvikapoor : ఏంట్రా ఇది.. జాన్వీ కపూర్ కే డబ్బులిచ్చాడు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇది..

Janvikapoor : బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లలో జాన్వీ కపూర్ కూడా.. ఈమె నటించిన మొదటి సినిమా దేవర ఇంకా రిలీజ్ కాలేదు కానీ వరుస సినిమా ఆఫర్స్ ఆమె తలుపు తడుతున్నాయి. దేవర నుంచి చుట్టమల్లే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా జాన్వీ గురించి మరో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. జాన్వీ కపూర్ ఫ్యాన్ ఆమె షాక్ ఇచ్చినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

నిన్న రక్షాబంధన్ ను సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకూ నిన్న రక్షా బంధన్‌ను చాలా ఆనందంగా జరుపుకున్నారు. తమ తోబుట్టువులతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే హీరోయిన్ జాన్వీ కపూర్‌ కూడా రక్షా బంధన్‌ను జరుపుకుంది. ఓ సినిమా షూటింగ్ సెట్లో ఉన్న జాన్వీని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా వచ్చారు. వారిని పలకరిస్తున్న జాన్వీని రిపోర్టర్లు ఫొటోలు తీశారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌ తనకి రాఖీ కట్టాలని జాన్వీని కోరాడు. దానికి ఆమె హ్యాపిగా ఫీల్ అవ్వడమే కాదు. అతనికి అడిగినట్లే రాఖీని కట్టింది. అయితే చివరిలో అతను ఇచ్చిన ట్విస్ట్‌కి జాన్వీతో పాటు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు..

The fan gave a shock to Janhvi Kapoor.. The video went viral
The fan gave a shock to Janhvi Kapoor.. The video went viral

జానీ కపూర్ రాఖీ కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఓ రేంజులో ట్రెండ్ చేస్తున్నారు. ఎవరితోనైనా రాఖీ కట్టించుకోవచ్చు కానీ నువ్వేందిరా జాన్వీతో కట్టించుకున్నావ్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అయినా జాన్వీ ఎంత మంచిదో కదా అంటూ కొంతమంది అంటుంటే ఆ బ్రో తప్పేం లేదు.. రాఖీ కడితే ఏదో ఒక గిఫ్ట్ లేదా డబ్బులు ఇవ్వాలిగా అదే చేశాడు.. అంటూ మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు. జాన్వికే డబ్బులివ్వాలని చూసిన ఫ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీ పాత్ర బావుంటుందని టాక్. వీటితో పాటుగా మరో రెండు సినిమాల్లో నటిస్తుందని టాక్..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు