Double Ismart : నార్త్‌లో ఇంకా లైగర్ ఫియర్ తగ్గలేదు… డబుల్ ఇస్మార్ట్‌ రైట్స్ రిజెక్ట్ ?

Double Ismart : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో రామ్ పోతినేని ఒకరు. రీసెంట్ టైమ్స్ లో రామ్ హిట్ కొట్టి చాలా రోజులైంది. దేవదాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు చేశాడు. అయితే రీసెంట్ టైమ్స్ లో మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ కెరియర్ లో ఒక హిట్ సినిమా కూడా పడలేదు. ఈసారి ఎలా అయినా మంచి హిట్ అందుకోవాలని ఉద్దేశ్యంతో పూరి జగన్నాథ్ తో మరోసారి చేయగలిపి డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు.

డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒకవైపు రామ్ కి ఎంత ఇంపార్టెంటో మరోవైపు పూరి జగన్నాథ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే లైజర్ సినిమాతో పూరి జగన్నా భారీ డిజాస్టర్ ను మూట కట్టుకున్నాడు. ఎప్పటినుంచో ఉన్న సేవింగ్స్ ని తర్వాత తీసుకొచ్చిన కొన్ని డబ్బుల్ని ఆ సినిమా మీద పెట్టుబడి పెట్టారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. సినిమా వలన చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు. కొంతమంది పూరీ జగన్నాథ్ ఇంటిముందు ధర్నా చేస్తామంటూ కూడా దిగారు. అయితే దీనికి పూరి జగన్నాథ్ స్పందిస్తూ అప్పట్లో ఒక ఆడియో కూడా రిలీజ్ చేశాడు.

Liger

- Advertisement -

లేకపోతే డబల్ ఇస్మార్ట్ సినిమా విషయానికి వస్తే ఇప్పటివరకు ఈ సినిమా మీద మంచి క్రేజ్ ఏర్పడింది. అలానే తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తెలుగులో భారీ ధరకు అమ్ముడయ్యాయి. అయితే లైగర్ సినిమా ఫెయిల్యూర్ ఎఫెక్ట్ సినిమా మీద పడలేదు అని దాదాపు అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు నార్త్ లో మాత్రం ఈ సినిమాకి బిజినెస్ జరగట్లేదు. డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి హిందీ శాటిలైట్ రైట్స్ అమ్మడానికి ఒక సంస్థను పూరీ వాళ్లు సంప్రదించారట. కానీ, వాళ్లు రిజెక్ట్ చేశారట. చాలా ఏళ్లు క్రితం అమితాబచ్చన్ తో సైతం బుడ్డ తేరా బాప్ అనే సినిమాను హిందీలో చేశాడు పూరి జగన్నాథ్. ఇక లైగర్ సినిమా ఎఫెక్ట్ వలన నార్త్ లో డబల్ ఇస్మార్ట్ సినిమాకి బిజినెస్ జరగట్లేదు. ఈ సినిమా హిట్ అయితే పూరీని వెతుక్కుంటూ మళ్లీ శాటిలైట్ వాళ్లు వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు