777 Charlie: ముఖ్యమంత్రికి కన్నీళ్లు పెట్టించిన సినిమా

కొన్ని సినిమాలు సూపర్ హిట్ లు అవుతాయి
ఇంకొన్ని సినిమాలు కాసుల వర్షం కురిపిస్తాయి
కానీ అతి తక్కువ సినిమాలు మాత్రమే మనిషిలోని మనసును తాకి కళ్ళలో నీళ్లు తిరిగేలా చేస్తాయి. ఈ మధ్యకాలంలో అటువంటి సినిమా అంటే “777 ఛార్లి” అని చెప్పొచ్చు.

ఛార్లి కథ విషయానికి వస్తే
ధర్మ అనే వ్యక్తి లోకం వేరు .. తన వరకు తనే కరెక్ట్ అనుకునే వ్యక్తిత్వం ధర్మాది. చూసే వాళ్ల దృష్టిలో త‌ను త‌ప్పుగా క‌నిపిస్తుంటాడు. ఇల్లు, ఫ్యాక్ట‌రీ, గొడ‌వ‌, ఇడ్లీ, సిగ‌రెట్‌, బీర్ ఇదే త‌న ప్ర‌పంచం. త‌న జీవితంలో ఇంట్రెస్టింగ్‌గా ఏదీ లేద‌ని అనుకునే ధ‌ర్మ జీవితంలో ఛార్లి అనే కుక్క ఎంట్రీ ఇస్తుంది.

ముందు ధ‌ర్మ‌కి ఛార్లి అంటే అస్స‌లు ప‌డ‌దు. దాన్ని ఎవ‌రికైనా ఇచ్చేయాల‌ని అనుకుంటూ ఉంటాడు. అలాంటి ధ‌ర్మ‌కి ఓసారి ఆప‌ద‌లో చిక్కుంటాడు. అప్పుడు ఛార్లి అత‌న్ని బ‌తికిస్తాడు. ఛార్లి త‌న‌పై చూపించే ప్రేమ‌కు ధ‌ర్మ మ‌న‌సు క‌రిగిపోతుంది. ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం పెరుగుతుంది. తరువాత జరిగే పరిణామాలు ఏంటి.? ప్రేక్షకుడిని అంతలా కదిలించిన విషయం ఏంటి అని తెలియాలి అంటే ఛార్లి సినిమాను చూడాల్సిందే.

- Advertisement -

ఈ సినిమాను కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కోసం బెంగళూరులో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన సీఎం బసవరాజ్ బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పలుమార్లు కళ్లు తుడుచుకున్నారు. అంతేకాదు, 777 చార్లీ సినిమాను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని చెబుతూ. “శునకాలపై ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రంలో జంతువుల భావోద్వేగాలను కూడా చూపించారు. ఈ సినిమాలో కుక్క తన కళ్ల ద్వారా భావాలను చూపిస్తుంది” అని బొమ్మై వివరించారు.ఈ సినిమాలో కుక్కను చూడగానే, గతేడాది మరణించిన తన పెంపుడు శునకం స్నూపీ గుర్తుకువచ్చిందని చెబుతూ ఆయన తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు