The GOAT : గోట్ మూవీని చూడడానికి ధియేటర్ కు వెళ్లిన గోట్… విజయ్ ఫ్యాన్స్ కు ముదిరిన పైత్యం

The GOAT : దలపతి విజయ్ హీరోగా నటించిన ది గోట్ మూవీ రోజు థియేటర్లలోకి వచ్చింది. సినిమాపై నెగెటివ్ టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఓ థియేటర్లో గోట్ మూవీని చూడడానికి గోట్ రావడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి ఈ ఆశ్చర్యకర ఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలుసుకుందాం పదండి.

గోట్ మూవీని చూడడానికి వచ్చిన గోట్

విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న వేళ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ థియేటర్లలోకి రావడంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. థియేటర్ల బయట అభిమానులు పటాకులు పేల్చడం, డప్పుల చప్పుళ్లకు డ్యాన్స్ చేయడం వంటి వాటి ద్వారా తమ ఉత్సాహన్ని బయట పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఓ నటుడు విజయ్ పై ఉన్న అభిమానాన్ని బయట పెట్టడానికి గోట్ ను తీసుకుని గోట్ మూవీని చూడడానికి థియేటర్ కు వచ్చాడు. గోట్ మూవీ ప్రత్యేక ప్రదర్శనలో తమిళ నటుడు కూల్ సురేష్ మేకతో ఒక థియేటర్‌లోకి ప్రవేశించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రిలీజ్ ను తమిళనాడులో ఉన్న విజయ్ ఫ్యాన్స్ ఒక పండగలా జరుపుకుంటున్నారు. కానీ తెలుగులో మాత్రం గోట్ మూవీపై నెగెటివ్ టాక్ నడుస్తోంది.

నమ్మశక్యం కాదు! విజయ్ 'గోట్' 'చూడడానికి' మేక వచ్చింది

- Advertisement -

తెలుగులో మినిమమ్ బజ్ లేకుండా థియేటర్లలోకి వచ్చింది గోట్. నిజానికి అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందన్న  విషయం కూడా ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ మొదట్లో విజయ్ లుక్స్ పై జరిగిన ట్రోలింగ్ కారణంగా గోట్ మూవీ అందరి దృష్టిలో పడింది. ప్రస్తుతానికి అయితే ఇది రొటీన్ రొట్ట కొట్టుడు మూవీ అంటూ ఏకిపారేస్తున్నారు విమర్శకులు. ఇలాంటి సినిమా కోసం థియేటర్లకు మేకను తీసుకురావడం వంటి వింత చేష్టలు చేస్తున్న విజయ్ అభిమానులను చూసి వీళ్ళకు పైత్యం ముదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మూవీకి మళ్లీ సీక్వెల్ కూడా?

వెంకట్ ప్రభు దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన గోట్ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశాడు. విజయ్ తండ్రి కొడుకులుగా నటించాడు. అలాగే మీనాక్షి చౌదరి, జయరామ్, ప్రభుదేవా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇక థియేటర్లలోనే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉండబోతోందని మేకర్స్ ప్రకటించారు. సీక్వెల్ కు GOAT vs OG అనే పేరు కూడా పెట్టారు. అయితే ఈ మూవీ సీక్వెల్ గురించి మేకర్స్ ఇప్పటిదాకా ఎక్కడా మాట్లాడలేదు. డైరెక్ట్ గా థియేటర్లలోనే వెల్లడించడంతో గోట్ మూవీనే బాలేదు అంటుంటే మళ్లీ దీనికి సీక్వెల్ కూడానా అంటూ నిట్టూరుస్తున్నారు తెలుగు మూవీ లవర్స్. ఇదిలా ఉండగా థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో గోట్ మూవీ డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు అనే విషయంపై మెకాశ్ నుంచి అధికారిక ప్రకటన కోసం విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు