The GOAT : విజయ్ ఫ్యాన్స్ కు షాక్… ఆ థియేటర్లలో గోట్ రిలీజ్ లేదు

The GOAT : దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 2024లో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై విజయ్ ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షోల అనుమతులు కూడా తెలుగు రాష్ట్రాలలో వచ్చేశాయి. కానీ విజయ్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కొన్ని టాప్ థియేటర్లలో గోట్ మూవీ రిలీజ్ కావట్లేదు. మరి దానికి కారణం ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

ఈ థియేటర్లలో గోట్ రిలీజ్ లేదు

వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన గోట్ చిత్రం రేపు (సెప్టెంబర్ 5) విడుదలవుతోంది. మీనాక్షీ చౌదరి, మోహన్, ప్రశాంత్, స్నేహ, ప్రభుదేవా, ప్రేమ్‌జీ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రాల్లో నటించారు. అయితే విజయ్ GOAT హిందీ వెర్షన్ ఉత్తర భారతదేశంలోని ప్రధాన జాతీయ సినిమా చైన్‌లలో అందుబాటులో ఉండదు. ఈ ప్రధాన జాతీయ చైన్ లలో PVR, INOX, సినీపోలిస్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. అయితే ఈ టాప్ థియేటర్ చైన్స్ గోట్ మూవీని తమ థియేటర్లలో రిలీజ్ చేయకపోవడానికి ఒక కారణం ఉంది. తమ థియేటర్లలో హిందీ చిత్రాల విడుదలను ప్రభావితం చేస్తున్న విధానానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నాయి.

GOAT Makers Confirms The IMAX Release With An Intriguing Poster | TimelineDaily

- Advertisement -

జాతీయ చైన్‌లు కొంత కాలంగా అన్ని కొత్త హిందీ సినిమాలు వాటి థియేటర్లలో విడుదల, OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రీమియర్‌ల మధ్య 8 వారాల గ్యాప్‌ని కొనసాగించాలనే ఒక విధానానికి కట్టుబడి ఉన్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాకముందే చలనచిత్రాలు థియేట్రికల్ గా లాంగ్ రన్‌ను అవ్వడం కోసమే ఈ రూల్ ను పెట్టుకున్నాయి. కానీ ప్రస్తుతం సౌత్ సినిమాలన్నీ దాదాపు నెల లేదా 40 రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఈ ప్రముఖ చైన్‌లలో GOAT హిందీ వెర్షన్ ను టాప్ థియేటర్లలో రిలీజ్ చేయట్లేదు. అందుకే BookMyShow (BMS) వంటి బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో గోట్ హిందీ వెర్షన్ అందుబాటులో లేదు. థియేట్రికల్, డిజిటల్ స్ట్రీమింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికే జాతీయ చైన్స్ ఈ రూల్స్ పెట్టుకున్నాయి. అయితే గోట్ రిలీజ్ చూస్తున్న హిందీ మూవీ లవర్స్ కు, ఇటు గోట్ టీంకు ఇదొక ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కానీ సౌత్ లో మాత్రం GOAT హిందీయేతర వెర్షన్లు PVR, INOX, Cinepolisలో ఎలాంటి కండిషన్లు లేకుండా రిలీజ్ అవుతున్నాయి.

లాస్ట్ మినిట్ లో పర్మిషన్

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానున్న గోట్ సినిమాకు సంబంధించిన స్పెషల్ షోలకు తమిళనాడులో లాస్ట్ మినిట్ లో పర్మిషన్ దొరకడం విశేషం. అసలు పర్మిషన్ దొరుకుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఎట్టకేలకు పర్మిషన్లు రావడంతో తమిళనాడుతో పాటు తెలంగాణలో కూడా గోట్ మూవీ స్పెషల్ షోలను రేపు ఉదయం 4 గంటలకే వేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు