The Greatest Of AllTime : టీం అంతా ఒక్కొ హీరో పేరును ప్లాన్ చేసుకున్నారు

The Greatest Of AllTime :కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. శంకర్(Shankar) దర్శకత్వం వహించిన స్నేహితుడు(Snehithudu) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మొదటిసారి పరిచయమయ్యాడు విజయ్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. అయితే ఆ సినిమా తర్వాత విజయ్ చేసిన సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన తుపాకీ(Thupaki) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ కి విజయ్ హైదరాబాద్ కూడా వచ్చాడు.

అయితే విజయ్ కి ఇక్కడ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సరిగ్గా విజయ్ ఉపయోగించుకోవడం లేదు. తుపాకీ సినిమా తర్వాత ఇప్పటివరకు విజయ్ చేసిన ఏ సినిమా ప్రమోషన్స్ కి కూడా హైదరాబాద్ కి రాలేదు. కానీ విజయ్ సినిమాలకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా లియో సినిమాకు సంబంధించి మొదటి చెన్నై కంటే కూడా హైదరాబాద్లోనే ఫస్ట్ షోస్ పడ్డాయి. లోకేష్ కనకరాజు విజయ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి.

లేకపోతే ప్రస్తుతం విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆల్ టైం అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ను రాత్రి నిర్వహించింది చిత్ర యూనిట్. అయితే ప్రొడ్యూసర్ అర్చన, వైభవ్, స్నేహ, దర్శకులు వెంకట ప్రభు హాజరయ్యారు. అయితే ఈ సినిమాకి సంబంధించి మీ దృష్టిలో గ్రేటెస్ట్ ఆల్ టైం ఎవరు అంటూ అక్కడున్న యాంకర్ ఒక్కొక్కరిని అడగటం మొదలుపెట్టారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Vijay's GOAT Takes Overseas Box Office by Storm! | Vijay's GOAT Takes  Overseas Box Office by Storm!

దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ ఆ దృష్టిలో గ్రేటెస్ట్ ఆల్ టైం బాలయ్య అని చెప్పారు. నిర్మాత అర్చన మాట్లాడుతూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గ్రేటెస్ట్ ఆల్ టైం కానీ నా దృష్టిలో మహేష్ బాబు గ్రేటెస్ట్ ఆల్ టైం అంటూ చెప్పుకొచ్చింది. ఎందుకంటే నేను ఒక్కడు వంటి సినిమాలు చూసే సినిమాలు మీద ఆసక్తి పెంచుకున్నాను అని చెప్పింది అర్చన. స్నేహ మాట్లాడుతూ నేను తెలుగులో చాలా మందితో వర్క్ చేశాను. కానీ నాకు గ్రేటెస్ట్ ఆల్ టైం అని అనిపించేది పవన్ కళ్యాణ్ గారు అంటూ చెప్పుకొచ్చింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో హీరో పేరు చెప్పి అందరు అభిమానులను ఆకర్షించారు అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు