The India House : చాలా రోజులకు నిఖిల్ మూవీ అప్డేట్… నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ ఎప్పుడంటే

The India House : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో వరుస సినిమాల షూటింగ్ లతో బిజీ అవుతూ ఉన్నాడు. ఇక రెండేళ్ల కింద కార్తికేయ2 హిట్ తో పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయిన నిఖిల్, ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఆల్రెడీ స్వయంభు అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, త్వరలోనే టీజర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇదిలా ఉండగా నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీ “ది ఇండియా హౌస్“ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఈ సినిమా కూడా ఒకటి. ఇక నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను రామ్ వంశి కృష్ణ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యువి ప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ తో కలిసి “వి మెగా పిక్చర్స్” అనే బ్యానర్ లో నిర్మిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ మే లో ఈ సినిమా అనౌన్స్ మెంట్ జరగగా, “స్పై” మూవీ రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభిద్దామనుకున్నా, స్వయంభు మూవీ షూటింగ్ స్టార్ట్ చేసాడు నిఖిల్. ఇక ఈ సినిమా చాలా రోజుల గ్యాప్ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ పై తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది.

The India House Movie Next Schedule Update

ది ఇండియా హౌస్ నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే?

తాజాగా “ది ఇండియా హౌస్” (The India House) మూవీ టీమ్ నుండి షూటింగ్ కి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ది ఇండియా హౌస్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ జులై 1 నుండి నాన్ స్టాప్ గా 15 రోజుల పాటు షూటింగ్ జరుగనుందని సమాచారం. ఇక ఆ షూటింగ్ షెడ్యూల్ ని ఆంధ్ర ప్రదేశ్ లో హంపి లో షూట్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో నూతన నటీనటులకు ఛాన్స్ ఇస్తూ ఆ మధ్య మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. పదేళ్ల నుండి 50 ఏళ్ల వరకు ఉన్న చిన్న, పెద్ద నటీనటులకు ఈ సినిమాలో అవకాశం ఇస్తున్నామని, అప్ కింగ్ యాక్టర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక ఈ సినిమా 1920 బ్యాక్ డ్రాప్ లో వీర్ సావర్కర్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుంది. నిఖిల్ సిద్ధార్థ్ శివ అనే పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ శ్యామ్ జి కృష్ణ వర్మ గా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

- Advertisement -

రెండు సినిమాలు ఒకేసారి..!

ఇక నిఖిల్ (The India House) ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. అటు స్వయంభు సినిమాలో నటిస్తూనే, ఇటు ది ఇండియా హౌస్ షూటింగ్ కూడా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలపై కూడా పాన్ ఇండియా వైడ్ గా మంచి అంచనాలున్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పైనే ఈ సినిమా మేకర్స్ దృష్టి ఉంది. ఇక ది ఇండియా హౌస్ ని ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మాతల్లో ఒకరు రాంచరణ్ కావడం వల్ల, పాన్ ఇండియా వైడ్ గా ది ఇండియా హౌస్ కి అటెన్షన్ వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సమ్మర్ లో ఉండే ఛాన్స్ ఉంది. ముందుగా స్వయంభు రిలీజ్ కానుండగా, ఈ ఏడాది స్వయంభు వచ్చే అవకాశం తక్కువే అనిపిస్తుంది. కాగా ది ఇండియా హౌస్ సినిమాను 2025 సమ్మర్ లో వీర్ సావర్కర్ జయంతి రోజున విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు