Darling : ఉన్న భయం పోయింది.. ప్రమోషన్లలో మేకర్స్ రెట్టించిన జోరు..

Darling : టాలీవుడ్ టాలెంటెడ్ కమెడియన్ కం హీరో ప్రియదర్శి హీరోగా నటించిన కొత్త సినిమా డార్లింగ్. ఈ సినిమా జులై 19న విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ను కొత్త దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కించాడు. ఇక చిన్న సినిమా అయినా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ,మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. పైగా రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి కామెడీతో ఉండి మెప్పించింది. బలగం వంటి సూపర్ హిట్ తర్వాత ప్రియదర్శి నుండి వస్తున్న సినిమా కావడంతో మూవీ లవర్స్ ఈ సినిమా కోసం బాగానే వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని జులై 19న విడుదల చేస్తున్నందుకు మేకర్స్ లో ఇప్పటివరకు ఒకరకమైన అసంతృప్తి, ఆందోళన వచ్చింది.

The makers are doing a promotional tour for the movie Darling

ఉన్న భయం పోయింది..

అయితే వచ్చే వారం రిలీజ్ కాబోతున్న డార్లింగ్ సినిమాకు సంబందించి చిత్ర నిర్మాతల్లో ఇప్పటివరకు తమ సినిమాని ఆదరిస్తారా లేదా అన్న అనుమానం ఉంది. ఎందుకంటే థియేటర్లలో ఇప్పటికీ కల్కి ఊపు సాగుతుండగా, లేటెస్ట్ గా భారతీయుడు2 థియేటర్లలో విడుదలైంది. రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల మధ్య తమ చిన్న సినిమాని చూస్తారా లేదా అనేది మూవీ యూనిట్ కి భయం పట్టుకుంది. కాగా ఇప్పుడు ఆ భయం పూర్తిగా తొలగిపోయింది. ఎందుకంటే కల్కి సినిమా రెండు వారాలు అయ్యాక కల్లెక్షన్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక నిన్న విడుదలైన ఇండియన్2 సినిమాకు నెగిటివ్ రెస్పాన్స్ రావడమే కాకుండా, ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో వచ్చే వారానికి ఈ సినిమాలు సందడి పూర్తిగా తగ్గిపోవడం ఖాయమవడంతో జులై 19న విడుదలవుతున్న డార్లింగ్ పై మూవీ లవర్స్ ఫోకస్ ఉంటుందని, తమ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావచ్చని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

రెట్టించిన ప్రమోషన్లు…

ఇక భారతీయుడు నెగిటివ్ రెస్పాన్స్ తో డార్లింగ్ (Darling) మూవీ మేకర్స్ ఇక తమకు డోకా లేదని రెట్టించిన ప్రమోషన్లు స్టార్ట్ చేసారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాల్ని పెంచేయగా, తాజాగా ప్రమోషనల్ టూర్లు వేస్తున్నారు. ముందుగా హైదరాబాద్ లో సినిమాని ప్రమోట్ చేసిన డార్లింగ్ మేకర్స్, నేడు వైజాగ్ కి సినిమాని ప్రమోట్ చేసేందుకు వెళ్తున్నారు. ఆ తర్వాత తిరుపతికి కూడా వెళ్తున్నట్టు సమాచారం. ఇక డార్లింగ్ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్‌ను రాగా, సినిమా రన్ టైం ని 2 గంటల 20 నిమిషాల నిడివితో ఉంటుందని సమాచారం. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ వారు నిర్మించిన ఈ చిత్రం జూలై 19న థియేటర్లలోకి రాబోతుంది. మరి డార్లింగ్ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు